»   » సీక్రెట్ గా పెళ్ళి జరిగిందన్న వార్తపై స్పదించని ప్రేమ జంట...!?

సీక్రెట్ గా పెళ్ళి జరిగిందన్న వార్తపై స్పదించని ప్రేమ జంట...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోలీవుడ్ ప్రేమ జంట ప్రభుదేవా-నయనతారల వివాహం దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిందని తాజా అందిన సమాచారం. ప్రస్తుతం దక్షిణాదిలోని టాప్ హీరోయిన్లలో నయనతార ఒకరుగా చెలామణి అవుతున్నారు. అలాగే, ప్రభుదేవాకు కూడా మంచి క్రేజ్ ఉంది. అదేసమయంలో తన భార్య రమలతకు ప్రభుదేవా విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఆయన పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది.

తన భార్య రామ్ లత్ దగ్గరనుంచి విడాకులు పొందిన ప్రభుదేవా త్వరలో తన ప్రేయసి నయనతారను పెళ్లి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారని. అందుకే రీసెంట్ గా నయనతార కూడా మతం మార్పిడి చేసుకొని శాస్త్రోక్తంగా హిందూ యువతిగా మార్చుకొందని సమాచారం. గత నెలలో వీరి పెళ్లి ముంబాయ్ లో జరుగుతుందని వార్తలు వచ్చాయి. పెళ్లెప్పుడు అనేది ప్రభుదేవా, నయనతార ప్రకటించలేదు. అయితే..ఇటీవల ఈ ఇద్దరూ ముంబాయ్ లో అత్యంత నిరాడంబరంగా రహస్య వివాహం చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుదేవా, నయనతార కూడా ఈ వార్తను ఖండించలేదు. కాబట్టి కళ్యాణం అయిపోయిందని పరిశీలకులు అంటున్నారు.

ప్రస్తుతం అక్షయ్ కుమార్, సోనాక్షీ సిన్హా హీరో హీరోయిన్లుగా "రౌడీ రాథోర్" అనే చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తూ ముంబైలోనే ఉంటున్నారు. అందులో మరో పాత్రలో నయనతార నటించనున్నట్టు సమాచారం.

English summary
The news said a couple of day before Prabhu Deva and Nayantara they get top secret Marriage. But they answered quite silent about this. Recently Nayantara convert to Hindu for marry him. In this situation the rumor reach among the people.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu