»   » సింగపూర్ లో సెటిల్ అవుతామంటున్న రెండు ప్రేమ పక్షులు..!

సింగపూర్ లో సెటిల్ అవుతామంటున్న రెండు ప్రేమ పక్షులు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభుదేవా, రమలత్ కి విడాకులు వచ్చిన నేపథ్యంలో నయనతార, ప్రభుదేవా వివాహం త్వరలో జరగనుందనే వార్తలు ఎక్కువయ్యాయి. తాజాగా ఈ ఇద్దరి గురించి మరో వార్త ప్రచారంలో వుంది. ప్రభుదేవాకి బాలీవుడ్ లో కమిట్ మెంట్స్ ఎక్కువగా వుంటాయి కాబట్టి మొదట ముంబాయ్ లో సెటిల్ అవుదామని ఈ జంట ప్రేమికులు ప్లాన్ చేసుకున్నారట. కానీ నయనతార ముంబాయ్ లో కంటే ఇండియా వదిలేసి! ఎంచక్కా సింగపూర్ లో సెటిలైతే బాగుంటుందని అంటోందట..

ప్రభుదేవా, నయనతార ప్రేమజంట సింగపూర్ లో స్థిరపడాలని కోరుకుంటున్నారా? దీనికి అవుననే సమాధానం చెబుతున్నాయి కోలీవుడ్ వర్గాలు. రేపు సెప్టెంబర్ లో పెళ్లి చేసుకున్న తర్వాత తమ నివాసాన్ని సింగపూర్ కి మార్చుకోవడానికి ఈ జంట ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటోందని తెలుస్తోంది. చెన్నై లో స్థిరపడడానికి నయనతార మొదటి నుంచీ అయిష్టంగానే వుందట. తను హిందీ సినిమాలలో బిజీ కావడం వల్ల తమ నివాసాన్ని ముంబై మారుద్దామని ప్రభు ప్రపోజ్ చేసినా... నయన్ దానికీ ఒప్పుకోవడం లేదట. దాంతో ఎంతో చర్చించుకుని ఆలోచించుకున్న మీదట, ఇక సింగపూర్లో సెటిల్ అవుదామని ఇద్దరూ డిసైడ్ అయ్యారని అంటున్నారు. పైగా, ప్రభుదేవా నెలకొల్పిన డ్యాన్స్ స్కూల్ (ప్రభుదేవా డ్యాన్స్ అకాడెమీ) కూడా అక్కడే వున్నది. కాబట్టిదగ్గరుండి చూసుకోవచ్చన్నది నయన్ ఉద్దేశమట!

English summary
The celebrity couple Prabhu Deva and Nayantara are getting ready for their marriage now and apparently they’ve found a new place to settle down. Buzzes rounding in airs are that Nayantara is feeling uncomfortable to live in Chennai and is insisting on settling down in Singapore after their marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu