»   » 'మర్యాద రామన్న' తమిళ రీమేక్ ఖరారు...డిటేల్స్

'మర్యాద రామన్న' తమిళ రీమేక్ ఖరారు...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన పంథా మార్చి తీసిన కామెడీ చిత్రం 'మర్యాద రామన్న'. సునీల్‌ ,సలోని కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం హాస్య ప్రియులను విశేషంగా అలరించింది. త్వరలో 'మర్యాద రామన్న' తమిళతంబీలను కూడా పలకరించనుంది. సునీల్‌ పాత్రలో సంతానం నటించనున్నట్లు సమాచారం. దర్శకుడు కన్నన్‌ తెరకెక్కించనున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

కోలీవుడ్‌లో 'ఈగ' సాధించిన విజయంతో రాజమౌళికి క్రేజ్‌ పెరిగింది. ఆయన చిత్రాలను దిగుమతి చేసుకునేందుకు ఇక్కడి నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో 'మర్యాద రామన్న' తమిళ హక్కులను పీవీపీ సంస్థ పొందింది. పీవీపీ సంస్థ తమిళంలో 'ఈగ' డబ్బింగ్ వెర్షన్ కి నిర్మాతగా వ్యవహించింది. ఈ నేపధ్యంలో 'మర్యాద రామన్న' తమిళ రీమేక్ కు సైతం మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. దానికి తగినట్లే సంతాకంకు తమిళంలో స్టార్ కమిడియన్ గా పేరు ఉండటం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం.

మరో ప్రక్క 'మర్యాద రామన్న'హిందీ వెర్షన్ విడుదలకు సిద్దమవుతోంది. అజయ్‌దేవగన్, సొనాక్షిసిన్హా, సంజయ్‌దత్, జుహీచావ్లా తదితరుల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'సన్నాఫ్ సర్దార్'. అజయ్‌దేవగన్ మాస్ హీరో కాబట్టి ఆయనకు తగ్గట్టుగా, హిందీ నేటివిటీకి అనుగుణంగా కథలో కొంత మసాలా జోడించి తెరకెక్కించారు దర్శకుడు అశ్విన్ ధీర్. నవంబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం పంజాబ్ పాటియాలా నేపద్యంలో జరుగుతుంది. ప్రత్యేకమైన ఇంటిసెట్ వేసి భారీగా ఈ చిత్రాన్ని షూట్ చేసారు.

మర్యాద రామన్న చిత్రం కన్నడంలో రీమేకై ఆ మధ్యన విడుదలైంది. అయితే అక్కడ పెద్దగా ఆడలేదు. కోమల్ అనే ఆర్టిస్టు కన్నడ మర్యాద రామన్న లో సునీల్ పాత్రను చేసాడు. కీరవాణి సంగీతం అందించాడు. తెలుగు ఉన్నదున్నట్లుగా అనువదించారు. ఉపేంద్ర అక్కడ సైకిల్ వాయిస్ కి డబ్బింగ్ ఇచ్చారు. తెలుగులో రవితేజ చెప్పినట్లుగా చేసాడు. ముకేష్ రుషి..ఇక్కడ తెలుగులో నాగినీడు పాత్రను చేసాడు. నిషా అక్కడ హీరోయిన్ గా సలోని పాత్రను చేసింది.

English summary
Rajamouli's Maryada Rammanna is being remade as Son of Sardar in Hindi is old news. The latest buzz is that this superhit Telugu comedy is being remade in Tamil. PVP cinema has remake rights for South. And the production house is planning to remake it in Tamil with the comedian Santhanam.
Please Wait while comments are loading...