»   » తండ్రి డైరక్టర్ తో నాగచైతన్య నెక్స్

తండ్రి డైరక్టర్ తో నాగచైతన్య నెక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన తండ్రితో గగనం చిత్రం రూపొందించిన రాధా మోహన్ తో నాగచైతన్య సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు వినిపిస్తోంది.ఇప్పటికే నాగచైతన్యని,నాగార్జున ని కలిసిన రాధా మోహన్ స్టోరీ లైన్ వినిపించి ఓకే చేయించుకున్నట్లు చెప్తున్నారు. సెన్స్ బుల్ గా నడిచే డ్రామా తో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది.ప్రస్తుతం నాగచైతన్య రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న బెజవాడ చిత్రంలో చేస్తున్నారు. అనంతరం ప్రస్దానం దర్శకుడు దేవకట్టాతో ఆటోనగర్ సూర్య చిత్రం చేస్తున్నారు. బెజవాడ చిత్రంని అక్టోబర్ 21 న విడుదల చేయాలని ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.ఇక ఈ చిత్రం ఎనభైల్లోనూ,తొంభైల్లోనూ విజయవాడలో జరిగిన కాస్ట్ పాలిటిక్స్,యూనియన్ ఇష్యూల చుట్టూ తిరుగుతుంది. నాగచైతన్య 'బెజవాడ"గురించి మాట్లాడుతూ -''రామ్‌గోపాల్‌వర్మ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ఎంతో ఎక్సైట్ అయ్యాను. ఇందులో నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు వివేక్ అద్భుతంగా సినిమాను తీస్తున్నారు. నా కెరీర్‌కి ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది" అన్నారు.ఈ చిత్రం చుట్టూ ఇప్పటికే చాలా కాంట్రావర్శీ పేరుకుంది.వర్మ ఈ చిత్రం టైటిల్ వివాదంతో సినిమా ప్రారంభించి క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్ గా నాన్న ఫేమ్ అమలా పౌల్ ని ఎంపిక చేసారు. ఇక ఈ చిత్రానికి సంగీతం: అమర్ మొహ్లే, బప్పీటూటిల్, విశాల్, విక్రమ్, నేగి, ప్రదీప్ కోనేరు, ధరమ్ సందీప్, కెమెరా: ఎస్.కె.ఎ.భూపతి, ఆర్ట్: కృష్ణమాయ, సమర్పణ: వందిత కోనేరు.

English summary
More than two years later, Naga Chaitanya has been liked by Radha Mohan - the director of Akasamantha and Gagaganam. Unlike Gautham Menon who is known for his slick action films as also his ability to make romantic flicks, Radha Mohan is well-known for sensible and sensitive dramas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu