»   » సూపర్ స్టార్ అభిమానులూ..! ఇంక పండగచేస్కోండి

సూపర్ స్టార్ అభిమానులూ..! ఇంక పండగచేస్కోండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇదివరకు సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌ను ఆయన అభిమానులు ఇంతకు ముందు తరచూ కలిసేవారు. తరచు ఇలాంటి సమావేశాలు, మీట్ లూ జరుగుతూ ఉండేవి. అభిమానులకోసమే ఒక రోజు మొత్తం కేటాయించే వాడు రజినీ, అయితే ఆ తర్వాత అభిమానుల తాకిడి ఎక్కువ అవటం, ఆ ప్రాంతం లో ట్రాఫిక్ సమస్యలే కాక రజినీ ఆరోగ్య రీత్యా కూడా అలాంటి ప్రోగ్రాములు తగ్గించే వేస్తూ వచ్చి తర్వాత మొత్తంగా ఆపేసారు.

10 ఏళ్లు కావస్తోంది

10 ఏళ్లు కావస్తోంది

అలాంటి సమావేశం జరిగి 10 ఏళ్లు కావస్తోంది. మధ్యలో రజనీకాంత్‌ తన అభిమానులను కలవాలని భావించినా అనివార్యకారణాల వల్ల కుదరలేదు. ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ రజనీకాంత్‌ రాష్ట్రంలోని నలుమూలలకు చెందిన అభిమానుల్సి చెన్నైకి ఆహ్వానించి మంచి విందునిచ్చి వారితో ఫొటోలు దిగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసాడు.

 గతం లో లాగా

గతం లో లాగా

మళ్ళీ గతం లో లాగా అభిమానులతో కలిసి ఫొటోలు దిగటానికి కేటాయించాలకున్నారు. అయితే దాని పరిణామం మామూలుగా ఉండదని తర్వాత అర్థమయ్యింది. అయితే అభిమానులు విడివిడిగా తమ అభిమాన నటుడితో ఫొటోలు దిగాలని ఆశపపడ్డారు, అది సహజమైన కోరికే అయినా ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా 15 వేల మందితో నిర్ణయించిన తేదీలో విడివిడిగా ఫొటోలు దిగడం సాధ్యం కాదని అర్థమైపోయింది...

మళ్ళీ ఏమనుకున్నరో ఏమో

మళ్ళీ ఏమనుకున్నరో ఏమో

దాంతో రజనీకాంత్‌ ఈ అభిమానులతో కలయిక అనే కార్యక్రమాన్ని వాయిదా వేసి నట్లు ప్రకటించారు.అయితే మళ్ళీ ఏమనుకున్నరో ఏమో గానీ అభిమానులకోసం ఆ ఇబ్బందిని భరించటానికే సిద్ద పడ్డాడు. తాజాగా మరోసారి అభిమానులతో కలవడానికి రజనీకాంత్‌ కొత్తగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు, బహుశా మే నెల మూడో వారంలో గానీ, జూన్‌లో గానీ ఆ కార్యక్రమం ఉంటుందని సమాచారం.

అభిమానులు మాత్రమే

అభిమానులు మాత్రమే

అయితే ఈ కార్యక్రమంలో అభిమానులు మినహా ఇతరులెవరికీ అనుమతి ఉండదని సమాచారం. మొత్తానికి పదేళ్ళ తర్వాత జరగబోతున్న ఈ మీట్ రజినీ అభిమానులకు ఒక పండగ లాంటిదే అనుకోవచ్చు. ఒక్క తమిళనాడునుంచే కాదు దేశం నలుమూలల్లో అన్ని చోట్లనుంచీ రజినీ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు వాలిపోవటానికి సిద్దంగా ఉన్నారు ఫ్యాన్స్.

English summary
Superstar Rajinikanth had earlier announced that he will meet all his his fans in May or June at a venue in Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu