»   » రజనీకాంత్ ని పూర్తిగా అనుకరిస్తున్నాడు

రజనీకాంత్ ని పూర్తిగా అనుకరిస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : 'వరుత్తపడాద వాలిబర్‌ సంఘం' (తెలుగులో కరెంట్ తీగ) తర్వాత పొన్‌రామ్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌ నటిస్తున్న రెండో చిత్రం 'రజనీ మురుగన్‌'. ఇందులో అలనాటి నటి మేనక కుమార్తె కీర్తిసురేష్‌ హీరోయిన్ గా నటించారు. రాజ్‌కిరణ్‌, సూరి, సముద్రకని తదితరులు నటిస్తున్నారు. నశ్రియ, సమంత, లక్ష్మీమేనన్‌ తదితరులు అతిథిపాత్ర పోషిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘Rajini Murugan’ final schedule wrapped up

ఇందులో శివకార్తికేయన్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ పాత్రలో రజనీకాంత్‌ అభిమానిగా నటిస్తున్నారు. సాధారణంగా రజనీకాంత్‌ స్త్టెల్‌ను అనుకరించే శివకార్తికేయన్‌ ఇందులో ఏకంగా రజనీకాంత్‌ లాగే ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దీంతో చిత్ర యూనిట్‌ అంతా కలుసుకుని సంబరాలు చేసుకుంది.

ఈ చిత్రానికి డి.ఇమాన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'మనంకొండ పరవై', 'వరుత్తపడాద వాలిబర్‌ సంఘం' చిత్రాల్లోని పాటలు హిట్టయ్యాయి. నిర్మాణ దశలోనే ఈ సినిమా కొనుగోలుకు పోటీ నెలకొంటోంది. జీ తమిళ్‌ ఛానెల్‌ శాటిలైట్‌ హక్కులను కూడా సొంతం చేసుకున్నట్లు సమాచారం. జూన్‌లో చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నారు.

English summary
Sivakarthikeyan is now gearing up with his next movie, ‘Rajini Murugan’. Like all his previous movies, this film too will be a family comedy entertainer. The recent news from this corner is regarding the wrap of this film’s final schedule.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu