twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్ళు చెదిరేలా బాబా కాదు ‘రోబో’ ఫైనల్ కౌంట్ డౌన్ స్టార్ట్....

    By Sindhu
    |

    సూపర్ స్టార్ రజినీకాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన సైన్సు ఫిక్షన్ ఎంటర్టైనర్ 'రోబో' అక్టోబర్ 1, 2010న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమయ్యింది. సినిమా మొదలైన దగ్గరనుంచి ఇప్పటి వరుకు ప్రతి విషయంలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అంతగా ఆసక్తి చూపించవలసిన అంశాలు ఏమున్నాయి ఈ సినిమాలో..? చెప్పుకోవాలంటే సూపర్ స్టార్ రజినీకాంత్, ఐశ్వర్య రాయ్, శంకర్, రెహ్మాన్, పీటర్ హెయిన్స్, ఇలా చాలా మందే ఉన్నారు. ఇప్పటి వరుకు 'రోబో' సృష్టించిన రికార్డులు, సెన్సేషన్ లు రిలీజ్ కు ముందు ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం.

    కంప్యూటర్ గ్రాఫిక్స్ - హాలీవుడ్ టీం:
    రోబో లో రజినీకాంత్ ఒక పాటలో మనం ఇంతకు ముందు ఎన్నడు చూడని విదంగా తనదైన స్టైల్ లో100 కుఫై గా రకరకాల స్టైల్స్ లో కనిపించి అలరిస్తాడు. కంప్యూటర్ గ్రాఫిక్స్ విభాగంలో పని చేసిన హాలీవుడ్ నిపుణులు రోబో ను హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గనివిదంగా తీర్చిదిద్దారు. వారు రూపొందించిన దృశ్యాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి.

    బడ్జెట్ - పారితోషకాలు:
    రోబో బడ్జెట్ దాదాపు 170 కోట్లు, ఉపఖండంలోనే అత్యంత భారి బడ్జెట్ తో రూపొందిన చిత్రం. ఇక రజినీకాంత్ కు లాభాలలో భాగం కాకుండా 45 కోట్లు ముట్టజెప్పారు. ఐశ్వర్య 6కోట్లు తీసుకుంది.

    రోబో - రిలీజ్:
    రోబో అక్టోబర్ 1న ఇండియా సినిమా చరిత్రలోనే 2250 ప్రింట్లతో 3000 లకు ఫై గా దియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇది హాలీవుడ్ సినిమా 'స్పైడర్ మాన్" తర్వాత రెండవ అతి పెద్ద రిలీజ్. అంతేకాకుండా విదేశాలలో సినిమా పంపిణి హక్కులను HBO కైవసం చేసుకోవడం గమనార్హం. రజినీకాంత్ అభిమానులు ఎక్కువగా వున్న మలేషియా, జపాన్, చైనా, సింగపూర్, థైలాండ్ మున్నగుప్రాంతాలలో రోబో రిలీజ్ అవుతుంది. రోబో తెలుగు ప్రదర్శన హక్కులను కృష్ణ ట్రేడర్స్ అదినేత తోట కన్నారావు 27 కోట్లకు కైవసం చేసుకున్నారు.

    మ్యూజిక్:
    ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్.రహమాన్ స్వరపరిచిన సంగీతం ఇప్పటికే సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమా కోసం రెహ్మాన్ ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగించినట్టు తెలుస్తుంది.

    ఆడియో హక్కులు:
    థింక్ మ్యూజిక్ ఆడియో కంపెనీ 7 కోట్లకు సోనీ తో పోటి పడి మరీ ఆడియో హక్కులు గెలుచుకుంది. ఇది భారత దేశపు సినిచరిత్ర లోనే మొదటిసారి. రోబో ఆడియో ఫంక్షన్ మలేసియాలో చాలా అట్టహాసంగా జరిగింది.

    తమిళనాడు:
    'ఎందిరన్' (రోబో) చెన్నైలోని సత్యం సినిమా లో రోజు 24 షోలు, మాయాజాల్ లో 60 షోలు ప్రదర్శిస్తున్నారు. చెన్నై మొత్తం మీద 40 దియేటర్లలో రోబో విడుదల అవుతుంది. ప్రస్తుతానికి 'రోబో' రిలీజ్ కు ముందు కార్యక్రమాలను విజయవంతంగా చేసి సగంవిజయాన్ని పూర్తి చేసింది. మిగిలిన సగం మరో 48 గంటల్లో మొదలవబోతుంది. ఇక కౌంట్ డౌన్ మొదలయింది తాజా సమాచారం మరియు విశ్లేషణ కోసం వేచి చూడండి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X