»   » రజనీ పేరుని టట్టుగా వేయించుకుంది(ఫొటో)

రజనీ పేరుని టట్టుగా వేయించుకుంది(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తల్లి తండ్రులపై తనకున్న ప్రేమను పర్మనెంట్ టట్టూ వేయించుకోవటం ద్వారా రజనీకాంత్ కుమార్తె సౌంధర్య చాటింది. రీసెంట్ గా రజనీతో విక్రమ్ సింహా అంటూ 3డి యానిమేషన్ చిత్రం రూపొందించిన ఆమె తన తల్లి తండ్రి పేర్లను తన చేతిపై వేయించుకుంది. ఈ విషయమై ఆమె ట్విట్టర్ లో ఫొటో పెట్టి తెలియచేసింది. మీరు చూస్తున్నది ఆ ఫొటోనే.

ఇక ఇండియాలో 'టాటూ' పరిశ్రమ ఒక గుర్తింపులేని పరిశ్రమగా ఉండేది. గత కొన్నేళ్లుగా ఈ టాటూ పరిశ్రమ 100 శాతం విస్తరించినట్లు మైడాలా డాట్‌కామ్‌ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. బాలీవుడ్‌ సినీతారలు హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొనే తదితర సినీనటులు తమ శరీరంపై టాటూను పొడిపించుకోవడంతో యువత వీటిపై మోజు పెంచుకుందని ఆ సర్వేలో తేలింది. దేశంలో గత నాలుగేళ్లుగా టాటూ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోందని, ఇందుకు ప్రధానకారణం బాలీవుడ్‌ అని మైడాలా వ్యవస్థాపకులు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అనీషాసింగ్‌ మీడియాకు వివరించారు.

Rajinikanth Daughter gets Inked!

మొదట్లో 18-25 సంవత్సరాలలోపు యువతీ యువకులు తమ శరీరంపై టాటూ వేయించుకునేవారని, ప్రస్తుతం 40ఏళ్లు పైబడినవారు సైతం తమ శరీరంపై ఏదో ఒక భాగంలో టాటూ వేయించుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిందని అనీషాసింగ్‌ తెలిపారు. 1960కు పూర్వం కన్నా 1990 నుంచి ఇది ఒక ఫ్యాషన్‌ సింబల్‌గా మారింది. టాటూ ఇండస్ట్రీ నేడు పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెలకు సైతం విస్తరించింది. పాశ్చాత్య దేశాల్లో టాటూ వేసేందుకు ఉపయోగించే టెక్నిక్‌లు, డిజైన్లను ఇండియాలో ఉపయోగించడం లేదని ఆ సర్వేలో తేలింది. టాటూ అనేది ఒక ఆర్ట్‌ మాత్రమే. నేటి యువతరం గుడ్డిగా నూతన పోకడలను అనుసరిస్తున్నారు. టాటూ అనేది జీవితాంతం ఉండే గుర్తు. ఈ టాటూలో డిజైన్లలో ముఖ్యంగా శివుడు, గణేష్‌, కొటేషన్లు,feather tatoos bright colourకు బాగా డిమాండ్‌ ఉంది.

టాటూ పరిశ్రమ ఇండియాలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న పరిశ్రమ అని ముంబయిలోని అంధేరికి చెందిన టాటూ ఆర్టిస్ట్‌ సచిన్‌ షేర్కార్‌ తెలిపారు. టాటూలు ఒక ఫ్యాషన్‌ గుర్తుగానే కాకుండా జీవితాంతం ఉండేలా తమ వద్దకు వచ్చే వారిలో కొందరు కోరుకుంటారని ఆయన తెలిపారు. బాలీవుడ్‌ సినీతారలవల్ల టాటూ పరిశ్రమ మరింత వేగంగా వృద్ధిచెందుతోందని ఆయన తెలిపారు. బాలీవుడ్‌ స్టార్స్‌ హృతిక్‌ రోషన్‌, సుసానే రోషన్‌లు సిక్స్‌పాయింట్‌ స్టార్‌తో టాటూ వేయించుకోవడమే నేటి యువతకు క్రేజ్‌గా, ఒక ఫ్యాషన్‌ సింబల్‌గా మారింది. ప్రియాంక చోప్రా తన కుడి మోచేయిపై Daddy's Little girl అనే టాటూను, అక్షయ్‌కుమార్‌ వీపు వెనుకభాగాన తనకుమారుడు 'ఆరవ్‌' పేరుతో, దీపికా పదుకొనే 'ఆర్‌కె' అనే టాటూ వేయించుకోవడం నేటి యువతరానికి ఫ్యాషన్‌గా మారిందని ఆ సర్వేలో వెల్లడైంది.

English summary
Soundarya Rajinikanth choose the names of her father Rajni and mother Latha for the permanent tattoo. "Forever love ! Inked for life :) Amma & Appa …!!!," she comments, while sharing the picture.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu