»   » 22 ఏళ్ల తర్వాత మళ్లీ ‘డిజిటల్‘ బాషా.. ఆస్పత్రిలో చూసిన కరుణానిధి

22 ఏళ్ల తర్వాత మళ్లీ ‘డిజిటల్‘ బాషా.. ఆస్పత్రిలో చూసిన కరుణానిధి

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే' అని బాషా చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన డైలాగ్‌తో దక్షిణాది సినిమా థియేటర్లు దద్దరిల్లాయి. ఆ డైలాగ్‌కు ప్రేక్షకులు పేపర్లు చింపి, ఈలలతో హోరెత్తించారు. 1995‌లో విడుదలైన బాషా చిత్రం బ్లాక్ బస్టర్‌గా చేసింది. రజనీకాంత్‌ను అందనంత ఆకాశానికి ఎత్తేసింది. అలాంటి ప్రజాదరణ, సంచలనాత్మక చిత్రం తాజాగా మరోసారి మార్చి 3 తేదీ శుక్రవారం మరోసారి విడుదలైంది.

రజనీకాంత్‌ను సూపర్ స్టార్ స్థాయికి..

రజనీకాంత్‌ను సూపర్ స్టార్ స్థాయికి..

రజనీ కెరీర్‌లోనే అత్యంత విజయం సాధించిన చిత్రంగా బాషా నిలిచింది. ముంబైలో డాన్‌గా ఉన్న బాషా సామాన్య జీవితం గడిపే వ్యక్తిగా ఎందుకు మారాడు అన్నది చిత్ర కథ. ఈ చిత్రంలో నగ్మా, రఘువరన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి దేవా సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ మీడియాలో మార్మోగుతున్నాయి.

హాస్పిటల్ బెడ్‌పై కరుణానిధి

హాస్పిటల్ బెడ్‌పై కరుణానిధి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎం కరుణానిధి తీవ్ర అనారోగ్యంతో ఉన్నా హాస్పిటల్‌లో ఇటీవల బాషా చిత్రాన్ని చాలా ఆసక్తితో చూశాడట. ఈ చిత్రాన్ని తీవ్ర అనారోగ్యానికి గురై హాస్పిటల్ చేరిన సంగతి తెలిసిందే. భారత రాజకీయాల్లో కురువృద్ధుడైన ఆయనకు బాషా అంటే బాగా ఇష్టమట. అందుకే అస్వస్థతకు గురైనా ప్రత్యేకంగా ఆ చిత్రాన్ని అడిగి వీక్షించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

బాషాకు మళ్లీ అదే క్రేజ్

బాషాకు మళ్లీ అదే క్రేజ్

తాజాగా డిజిటల్ ఫార్మాట్‌లో విడుదలైన బాషాకు తమిళనాడులో మంచి స్పందన కనిపించింది. ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో సినిమాల డిజిటలైజేషన్ ప్రక్రియ ఊపందుకొన్నది. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేషన్ నటించిన చిత్రాలను డిజిటలైజ్ చేస్తున్నారు.

డిజిటలైజేషన్ దిశగా తమిళ చిత్రాలు

డిజిటలైజేషన్ దిశగా తమిళ చిత్రాలు

ప్రజాదరణ పొందిన చిత్రాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశంతో 35 ఎంఎం సినిమాలను 70 ఎంఎంగా మారుస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో అప్ గ్రేడ్ చేస్తున్నారు.

English summary
Rajinikanth's Baasha re-releases after 22 years, makers confident of positive response Rajinikanth's iconic 1995 film Baasha has been digitalised for its re-release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu