Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
రజనీకి అరుదైన గౌరవం.. అమితాబ్ సరసన తలైవా విగ్రహం
Recommended Video

సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. కాలా రిలీజ్‌ను పురస్కరించుకొని గురువారం (జూన్ 7న) రాజస్థాన్‌లోని అభిమానులు రజనీకాంత్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. జైపూర్‌లోని నహార్‌గఢ్ కోటలోని మ్యూజియంలో రజనీకాంత్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. విగ్రహం బరువు 55 కేజీలు, ఎత్తు 5.9 అడుగుల ఉన్న ఈ విగ్రహాన్ని వ్యాంగ్ పింగ్, సుశాంత రే మూడు నెలలపాటు శ్రమించి రూపొందించారు అని మ్యూజియం డైరెకర్టర్ అనూప్ శ్రీవాస్తవ వెల్లడించారు.

సందర్శకుల కోరిక మేరకు
నహార్‌గఢ్ కోట మ్యూజియానికి దక్షిణ భారత దేశం నుంచి ఎక్కువ సంఖ్యలో టూరిస్టులు వస్తారు. ఈ కోటలో రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చేసిన సూచన మేరకు మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశాం అని శ్రీవాస్తవ పేర్కొన్నారు.

అమితాబ్ పక్కనే తలైవా
మ్యూజియంలోని హాల్ ఆఫ్ ఐకాన్ సెక్షన్‌లో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ విగ్రహం పక్కనే రజనీకాంత్ మైనపు బొమ్మను ఏర్పాటు చేయడం గమనార్హం. రజనీకాంత్ విగ్రహం ఏర్పాటు తర్వాత ఈ మ్యూజియంలో విగ్రహాల సంఖ్య 36కు చేరింది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన నరసింహ చిత్రంలోని స్టిల్‌ను ఆధారంగా చేసుకొని రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

త్వరలో రజనీకాంత్‌కు ఆహ్వానం
జైపూరు మైనపు విగ్రహాల మ్యూజియంను సందర్శించాలని త్వరలోనే రజనీకాంత్‌కు ఆహ్వానం పంపుతాం. మా ఆహ్వానాన్ని ఆయన మన్నిస్తారో లేదో వేచి చూడాల్సిందే అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. టూరిస్టుల ఫీడ్‌బ్యాక్‌ను తీసుకొని ఈ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

అమీర్, సల్మాన్, షారుక్ విగ్రహాలు
త్వరలోనే షారుక్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. సందర్శకులకు కొత్త అనుభూతిని పంచడానికే ఈ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే నవతరానికి స్ఫూర్తి నింపేలా ఈ విగ్రహాలు దోహదపడుతాయి అనే అభిప్రాయాన్ని మ్యూజియం డైరెక్టర్ శ్రీవాస్తవ వ్యక్తం చేశారు.