»   » రమ్యకృష్ణకు నష్టపరిహారం: కోర్టు ఆదేశం

రమ్యకృష్ణకు నష్టపరిహారం: కోర్టు ఆదేశం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ramya Krishna gets Rs 5 lakh for defunct generator
చెన్నై: వాదనలు, ప్రతివాదనలు, స్ట్రగుల్, చివరకు విజయం...ఇలాంటి కంటెంట్ కలిగిన పాత్రలెన్నో రమ్యకృష్ణ వెండితెరపై చేసి ఉండవచ్చు. కానీ నిజ జీవితంలోనూ ఇలాంటి ఫేజ్ ని ఎదుర్కొని ఆమె గెలిచి చాలా మందికి మార్గదర్శనంగా నిలిచింది. మరమ్మతుకు గురైన జెనరేటరును సరిచేసి ఇవ్వనందున బాధితురాలు రమ్యకృష్ణకు నష్టపరిహారం చెల్లించాలని ఓ ప్రైవేటు సంస్థకు ట్రిబ్యునల్‌ కోర్టు ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే.... నటి రమ్మకృష్ణ చెన్నై ట్రిబ్యునల్‌ న్యాయస్థానంలో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో తాను గత 2010 జూలై 23న కీల్పాకంలోని టెక్‌నోమేక్‌ ఏజెన్సీ వద్ద నుంచి రూ. 4.68 లక్షలు విలువచేసే జెనరేటరును కొనుగోలు చేశానని తెలిపారు.

అయితే కొద్ది రోజులకే అందులో సమస్యలు తలెత్తటంతో కొత్తది పంపాల్సిందిగా సంస్థ నిర్వాహకులను కోరానని చెప్పారు. అయితే దీనికి సంబంధించి వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. దీనిపై న్యాయమూర్తి మోహన్‌దాస్‌ సమక్షంలో మంగళవారం సాయంత్రం విచారణ జరిగింది.

నాణ్యతలేని వస్తువును అందజేయడంతో పాటు, మరమ్మతుకు గురైన దాన్ని కనీసం సరిచేసి కూడా ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. బాధితురాలికి ఆమె చెల్లించిన రూ. 4.68 లక్షలతో సహా నష్ట పరిహారంగా రూ. 52 వేలు ఇవ్వాలని ఆదేశించారు. ఆరు వారాల్లో ఈ మొత్తాన్ని అందజేయాలని ఉత్తర్వులు జారీచేశారు.

English summary
Following Ramya Krishna complaint in the district consumer disputes redressal forum, Chennai (north) regarding a dysfunctional generator worth 4.6 lakh, the forum has asked the manufacturer and the dealer to refund the amount along with a compensation of 50,000 for deficiency in services.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu