»   » ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందంటే ఇదేనా? రజనీతో కలిని నటించినందుకు కోట్లలో డిమాండ్!

ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందంటే ఇదేనా? రజనీతో కలిని నటించినందుకు కోట్లలో డిమాండ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rajini Brand Mark Value For Dog రాత్రికి రాత్రికి అదృష్టం అంటే ఇదేనేమో ...

'ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది' అనే సామెత గుర్తుందా? తాజాగా రజనీకాంత్ మూవీలో ఆయనతో కలిసి నటించిన ఓ కుక్క విషయంలో ఇది నిజం అయింది. 'కాలా' చిత్రంలో మణి అనే ఓ కుక్క నటించింది. రజనీకాంత్ పక్కన నటించడంతో ఈ కుక్క ఇపుడు బాగా పాపులర్ అయింది. దీన్ని దక్కించుకోవడానికి రజనీకాంత్ అభిమానులు పోటీ పడుతున్నారు.

వీధి కుక్క జీవితం మారిపోయింది

వీధి కుక్క జీవితం మారిపోయింది

మరి ఇది రజనీకాంత్ స్టార్ పవరో? లేక మణి అదృష్టమో తెలియదు కానీ.... వీధి కుక్క జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. ఈ కుక్కకు కోట్లు ఇస్తామనే ఆఫర్లతో పాటు, ఈ దాని ట్రైనర్‌కు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.

 చెన్నై వీధిలో దొరికింది

చెన్నై వీధిలో దొరికింది

‘మణి' తనకు చెన్నైలో రోడ్డుపై దొరికిందని దీని ట్రైనర్ సిమన్ వెల్లడించారు. కాలా సినిమా కోసం దర్శకుడు పా రంజిత్ కుక్క కావాలని అడిగారు. ఎన్ని కుక్కలు చూపించినా ఆయన ఇష్టపడలేదు, 30 కుక్కల తర్వాత చివరకు మణి ఫోటో చూసి ఓకే చేశారు అని సిమన్ ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అవకాశం రాదేమో అని భయపడ్డాను

అవకాశం రాదేమో అని భయపడ్డాను

సిమన్ మూడు దశాబ్దాలుగా సినిమాలకు కుక్కలు సప్లై చేస్తున్నాడు. దర్శకుడు చెప్పిన విధంగా కుక్కలతో నటింపచేస్తాడు. ఇప్పటి వరకు 800 నుండి 1000 సినిమాలకు అతడు పని చేశాడు. ‘కాలా' సినిమా కోసం దర్శకుడు పా రంజిత్ కుక్క కావాలని కోరగా చాలా కుక్కులు చూపించాను. ఆయన అన్నీ రిజెక్ట్ చేస్తుండటంతో.... ‘కాలా' సినిమాకు పని చేసే అవకాశం మిస్సవుతుందో ఏమో అని భయపడ్డానని ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు.

రజనీకాంత్ మణిని చాలా బాగా చూసుకున్నాడు

రజనీకాంత్ మణిని చాలా బాగా చూసుకున్నాడు

ఏ సినిమాకు అయితే పని చేస్తామో ఆ సినిమా నటులు కుక్కలతో మింగిల్ అయితేనే మేము వాటికి బాగా ట్రైనింగ్ ఇచ్చి దర్శకుడు చెప్పినట్లు వాటితో నటింపచేయగలుగుతాము. రజనీకాంత్ సార్ మణిని చాలా బాగా చూసుకున్నారు.... దాని కోసం ప్రత్యేకంగా బిస్కట్లు తెచ్చేవారు అని సిమన్ గుర్తు చేసుకున్నారు.

 మణి కళ్లంటే రజనీసార్‌కు చాలా ఇష్టం

మణి కళ్లంటే రజనీసార్‌కు చాలా ఇష్టం

మణి కళ్లంటే రజనీకాంత్ సార్‌కు చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన సెట్స్ లో చాలా సార్లు చెప్పారు.... అని సిమన్ గుర్తు చేసుకున్నారు.

 2, 3 కోట్లు ఇస్తామంటూ ఆఫర్

2, 3 కోట్లు ఇస్తామంటూ ఆఫర్

‘కాలా' పోస్టర్లో రజనీకాంత సార్ పక్కన మణిని చూసిన తర్వాత దీన్ని దక్కించుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. మలేషియా నుండి కొందరు రజనీ అభిమానులు రూ. 2 నుండి 3 కోట్లు ఇవ్వడానికి ముందు కొస్తున్నారు. కానీ నేను దీన్ని అమ్మడానికి సిద్ధంగా లేను, ఎందుకంటే మణిని నా సొంత బిడ్డలా చూసుకుంటున్నాను.... అని సిమన్ తెలిపారు.

English summary
Rs 3 Crore offer for a dog, which is part of Rajinikanth's forthcoming movie Kaala. Simon, an animal trainer, found Mani in a street in Chennai. "Pa Ranjith sir was not happy with any of the dogs that I had shown. He kept rejecting one after the other," he tells in an interview with Behindwoods. Simon also claims that people were willing to pay in crores for Mani after being part of a Rajinikanth film. "I received offers from Malaysia. People offered him Rs 2-3 crore. But I am not going to sale as I consider it like my baby," he said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu