»   » ఫోటోలు: సినిమా సెట్‌లో ఘనంగా సాయి పల్లవి బర్త్ డే సెలెబ్రేషన్స్!

ఫోటోలు: సినిమా సెట్‌లో ఘనంగా సాయి పల్లవి బర్త్ డే సెలెబ్రేషన్స్!

Subscribe to Filmibeat Telugu

సౌత్ లో హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి జోరు కొనసాగుతోంది. సాయి పల్లవి నటిస్తున్న చిత్రాలు మంచి విజయం సాధిస్తున్నాయి. ప్రేమమ్ చిత్రంతో గుర్తింపు పోయింది పల్లవి ఆ తరువాత ప్రతి చిత్రంతోనూ తన క్రేజ్ పెంచుకుంటోంది. వరుణ్ తేజ్ నటించిన ఫిదా చిత్రంతో ఈ హైబ్రిడ్ పిల్ల నిజంగానే తెలుగు వారిని ఫిదా చేసింది. ఫిదా చిత్రంలో సాయిపల్లవి ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ కు యువత అంతా ఆమె అభిమానులుగా మారిపోయారు.

Sai Pallavi birthday celebrations at Maari 2 sets

ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. బుధవారం సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా హీరో ధనుష్, మారి 2 చిత్ర యూనిట్ ఆమె బర్త్ డేని ఘనంగా సెలెబ్రేట్ చేశారు. సాయి పల్లవి మారి 2 చిత్రంలో ధనుష్ సరసన నటిస్తోంది. సాయి పల్లవి పుట్టిన రోజులు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Sai Pallavi birthday celebrations at Maari 2 sets

ఇక తెలుగులో ఈ భామ శర్వానంద్ సరసన పడి పడి లేచే మనసు చిత్రంలో నటిస్తోంది. పడి పడి లేచే మనసు చిత్ర యూనిట్ కూడా పోస్టర్స్ విడుదల చేసి సాయి పల్లవికి బర్త్ డే విషెష్ తెలియజేశారు. సాయి పల్లవి నటించిన ఫిదా, ఎంసీఏ చిత్రాలు విజయం సాధించగా కణం చిత్రం నిరాశ పరిచింది.

Sai Pallavi birthday celebrations at Maari 2 sets

English summary
Sai Pallavi birthday celebrations at Maari 2 sets. Pics goes viral in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X