»   »  'ప్రేమకథా చిత్రమ్‌' రీమేక్ కు సీక్వెల్

'ప్రేమకథా చిత్రమ్‌' రీమేక్ కు సీక్వెల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ను హీరోగా నిలబెట్టిన చిత్రం 'డార్లింగ్‌'. దెయ్యం చిత్రంతో పరిచయమైన ఈ కుర్ర హీరోకు నిజంగానే అదృష్టం కలిసొచ్చిందనే చెప్పాలి. 'ఐ', 'ఆంబల' వంటి పెద్ద చిత్రాల మధ్య విడుదల చేసినా.. మంచి గుర్తింపునే సొంతం చేసుకున్నారు జీవీ ప్రకాశ్‌. తెలుగులో హిట్‌ అయిన 'ప్రేమకథా చిత్రమ్‌'కు రీమేక్‌ ఇది. అయితే కథ పరంగా కొంత మార్పులు చేశారు.

అంతేకాకుండా చివర్లో కాస్త కొసమెరుపును అతికించడంతోపాటు.. అందుకు పొడిగింపు కూడా ఉందన్నట్టుగా కథను జోడించారు దర్శకుడు జాన్‌. గీతా ఆర్ట్స్‌, స్టూడియోగ్రీన్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సీక్వెల్‌ త్వరలోనే తెరకెక్కనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం స్క్రిప్ట్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని సమాచారం. కోలీవుడ్‌లో నడుస్తున్న దెయ్యం సినిమాల ట్రెండ్‌ను అక్షరాలా అందింపుచ్చుకుని 25వ రోజు దిశగా పరుగులు తీస్తోంది 'డార్లింగ్‌'. మరి సీక్వెల్‌ను ఎలా రూపొందిస్తారో వేచి చూడాలి.

Sequel to Darling soon?

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ హీరోగా, అతడి సరసన నిక్కి గల్‌రాణి నటించనున్నారు. 'వెయిల్‌' చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన జీవీ ప్రకాష్‌ ఇప్పటికే 'పెన్సిల్‌', 'త్రిష ఇల్లె నయన్‌తారా' చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు.'డార్లింగ్‌' జీవీ ప్రకాష్‌కు హీరోగా మూడో చిత్రం.

'ఒరు కాదల్‌ సెయ్‌వీర్‌' చిత్రం ద్వారా పరిచయమైన నటి సంజనకు నిక్కి గల్‌రాణి సహోదరి. ఆమె ఇప్పటికే మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించారు. ఈ చిత్రం అక్కడా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. అక్కడ కూడా హర్రర్ కామెడీ జానర్ చిత్రాలు హిట్ అవుతున్న నేపధ్యంలో బిజినెస్ సైతం బాగా జరుగుతుందని భావిస్తున్నారు.

English summary
Recent days the horror films are becoming trend and one such film released. Recently was Darling, a horror comedy film, which was released on pongal, got positive reviw and becase a super hit in box office. It's heard makers of this film planing for as sequel.
Please Wait while comments are loading...