»   » నాకు మంచి రోజులొచ్చాయ్, పేరు ఊరు నిలబడుతాయ్: శ్రియ

నాకు మంచి రోజులొచ్చాయ్, పేరు ఊరు నిలబడుతాయ్: శ్రియ

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత సంవత్సరం శ్రియకు చాలా దష్కాలము సంభవించిందని చెప్పవచ్చు. ఎందుకంటే, ఆమె నటించిన ఒక్క సినిమా కూడా విజయవంతం కాలేదు. దీనితో ఆమె పరిస్థితి బేజారుగా తయారైంది. పరిశ్రమ వర్గాల వారు కూడా ఆమె కాలం చెల్లిపోయింది అనుకొనే వరకు వచ్చారు. కానీ ఆశ్చర్యంగా ఆమె స్టార్ మళ్లీ తిరిగింది. ఆమెను ఎంతో ఉత్సాహపరుస్తూ ఈ సంక్రాంతికి విడుదలైన 'కుట్టి" చిత్రం ఘనవిజయం సాధించడంతో మళ్లీ విజయాల బాట మొదలైనదంటూ..శ్రియ సంతోషపడుతోంది. అంతే కాదు ఆమె తదుపరి చిత్రం 'జగ్గు భాయ్" కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశపడుతుంది శ్రియ.

ఈ చిత్రం విడుదల తర్వాత కూడా మరో చిత్రం 'చికుబుకు" వరుసలో ఉండటంతో ఏకంగా శ్రియ నటించిన మూడు సినిమాలు విడుదల అవ్వడం ఇదే మొదటిసారి అని చెప్పుకుంటున్నారు సినీప్రముఖులు. అంతే కాదు ఈ సంవత్సరం మళయాళ సినిమాలోనికి కూడా అడుగుపెడుతుంది శ్రియ. 'పోక్కిరి రాజా" అనే చిత్రంలో పృధ్విరాజ్ సరసన నటించే అవకాశాన్ని సోంతం చేసుకుని నాకు 2010 సంవత్సరం ఎంతో బాగుంది ఈ అవకాశాన్ని వదులుకోకుండా ప్రేక్షకుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటానంటుంది శ్రియ. ఒక్క సినిమా విజయానికే ఇలా ఎగిరిపడితే ఎలా? మిగతా సినిమాలు కూడా నిలబడగలగాలి కదా! అప్పుడే నీకు పేరు ఊరు ఉంటాయి. లేదంటే.. మళ్లీ మొదటికి వెళ్లక తప్పదు..అంటున్నారు సినీ విమర్శకులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu