పెళ్లి విషయంపై శృతిహాసన్ వార్నింగ్.. ఎవరికో తెలుసా?

By Rajababu

కాటమరాయుడు తర్వాత అందాల తార శృతిహాసన్ టాలీవుడ్‌లో కనిపించిన దాఖలాలు లేవు. తమిళంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తున్నది. తన లండన్ ప్రియుడు మైఖేల్ కోర్సలేను పెళ్లి చేసుకోవడమనేది ప్రధాన కారణంగా వినిపించింది. అయితే మీడియా వార్తలపై పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి వార్తలపై స్పందించారు.

పెళ్లి అనేది నా వ్యక్తిగత జీవితం. ఎవరినీ, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలన్నది నా నిర్ణయం. నా తల్లిదండ్రులు నాకు ఆ స్వేచ్ఛను ఇచ్చారు. నా వ్యక్తిగత జీవితంలో, పెళ్లి విషయంలో మీడియా జోక్యం చేసుకోకూడదు అని శృతి హాసన్ వార్నింగ్ ఇచ్చినంత పనిచేసింది.

Shruti Haasan lashed at the media over her marriage

శృతిహాసన్ చేతిలో తెలుగు, తమిళ చిత్రాలు లేకపోగా, హిందీలో ఓ చిత్రాన్ని అంగీకరించింది. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ పక్కన ఓ చిత్రంలో నటిస్తున్నది. నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి చంద్రముఖిగా టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో అమోల్ పాలేకర్, నసీరుద్దీన్ షా, ప్రతీక్ బబ్బర్, జిషు సేన్‌గుప్తా తదితరులు నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది ఆరంభంలో గానీ విడుదల కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X