»   » అంకుల్ తేల్చుకొందాం.. రా!.. మాజీ కేంద్ర మంత్రికి శింబు సవాల్

అంకుల్ తేల్చుకొందాం.. రా!.. మాజీ కేంద్ర మంత్రికి శింబు సవాల్

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Shimbu Challenges To Politician Ambumani On Sarkar Issue

  దళపతి విజయ్ నటించిన సర్కార్ సినిమా పోస్టర్ తమిళ సినీ, రాజకీయ వర్గాల మధ్య చిచ్చు రేపే సూచనలు కనిపిస్తున్నాయి. విజయ్ సిగరెట్ తాగుతున్న పోస్టర్‌ పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు, వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా ఉందంటూ ఇటీవల మద్రాస్ హైకోర్టులో ఓ సామాజిక కార్యకర్త పిటిషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఈ పోస్టర్‌పై మాజీ కేంద్ర మంత్రి అంబుమణి రాందాస్ కామెంట్ చేయడం వివాదానికి దారి తీసింది. ఈ వివాదానికి కేంద్ర బిందువైన అంబుమణికి తమిళ నటుడు శింబు తాజాగా సవాల్ విసిరాడు.

  శింబు వీడియో రిలీజ్

  శింబు వీడియో రిలీజ్

  సర్కార్ పోస్టరను వివాదం చేయడంపై నటుడు శింబు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. స్వప్రయోజనాల కోసం ఓ చిన్న పోస్టర్‌ను వివాదం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి క్రియేటివ్ స్వేచ్ఛను హరిస్తాయని శింబు పేర్కొన్నాడు.

  రజనీకాంత్‌కూ తప్పలేదు

  రజనీకాంత్‌కూ తప్పలేదు

  సిగరెట్ తాగే పోస్టర్‌పై వివాదం రేపడం కొత్తేమీ కాదు. గతంలో రజనీకాంత్ నటించిన బాబా చిత్రానికి ఇలానే వ్యతిరేకత వచ్చింది. ఇప్పడు విజయ్ నటించిన సర్కార్‌ చిత్రాన్ని ఇబ్బందుల్లో పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు అని శింబు వీడియోలో పేర్కొన్నారు.

  బహిరంగంగా చర్చిద్దాం రండి

  బహిరంగంగా చర్చిద్దాం రండి

  ధూమపానం వ్యతిరేకించే అంశాన్ని స్వప్రయోజనాలకు వాడుకొంటున్నారు. అదే విషయాన్ని బహిరంగ వేదికలపై చర్చించడానికి నేను రెడీగా ఉన్నాను. ధూమపానంపై ఓ చర్చను చేపట్టి దానికి అంబుమణి అంకుల్‌ను ఆహ్వానించాలని అనుకొంటున్నాను అని వీడియోలో శింబు అభిప్రాయపడ్డారు.

  సినిమా పరిశ్రమలో రాజకీయాలు

  సినిమా పరిశ్రమలో రాజకీయాలు

  సినిమా రంగం తరఫున కొందరు లేవనెత్తే అభ్యంతరాలకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. వివాదాన్ని పరిష్కరించడానికి ఇది సరైన పద్ధతి అని అనుకొంటున్నాను. తమిళ సినిమాలపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలకు జవాబు దొరుకుంతుంది. రాజకీయాలకు సినిమాను దూరంగా పెట్టడం కూడా జరుగుతుంది అని శింబు అన్నారు.

  మాజీ మంత్రి అంబుమణి కామెంట్

  మాజీ మంత్రి అంబుమణి కామెంట్

  సర్కార్ పోస్టర్‌లో సిగరెట్ తాగుతున్న హీరో విజయ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి అంబుమణి రాందాస్ ట్విట్టర్లో సెటైర్లు విసిరారు. తన తదుపరి చిత్రంలో విజయ్ పొగాకు వాడకాన్ని ప్రమోట్ చేసే విధంగా పోస్టర్‌ను రూపొందించడం సిగ్గుచేటు. నీ నోట్లో సిగరెట్ లేకుండానే నీవు చాలా స్టైలిష్‌గా ఉంటావు అని అంబుమణి ట్వీట్ చేశారు.

  English summary
  The controversy around Thalapathy Vijay’s Sarkar poster continues to grab the limelight for all the wrong reasons. Madras High court has now issued a notice against Thalapathy Vijay, director AR Murugadoss and production house Sun Pictures for releasing the poster of Vijay smoking a cigarette. Hero simbu reated on this contraversy. Simbu said that My views on this will be misconstrued if I speak out in this forum. I invite Anbumani uncle for a debate on this. As a representative of the cinema fraternity, I will answer all his queries in a public forum. I think that is the right way to do it.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more