TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
ఫ్యాన్ ఫైట్: ఫేక్ కలెక్షన్స్ నమ్మొద్దు అంటూ నిర్మాతల ప్రకటన!

సంక్రాంతికి విడుదలైన సినిమాలు బాక్సాఫీసు వద్ద హోరా హోరీగా తపడుతున్నాయి. తెలుగులో ఎన్టీఆర్-కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్ 2 చిత్రాలు విడుదలవ్వగా ఈ పండక్కి టాలీవుడ్ బాక్సాఫీసు విన్నర్ 'ఎఫ్ 2' అని తేలిపోయింది. కుటుంబ ప్రేక్షకులంతా ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ డ్రామాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే తమిళనాడు బాక్సాఫీసు వద్ద పరిస్థితి మరోలా ఉంది. రజనీకాంత్ మూవీ 'పేట'తో పాటు అజిత్ నటించిన 'విశ్వాసం' చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఇక్కడ బాక్సాఫీసు విన్నర్ ఎవరు. అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఫ్యాన్స్ తమ హీరో విన్నర్ అంటే తమ హీరో విన్నర్ అంటూ సోషల్ మీడియాలో ఫైట్ చేసుకుంటున్నారు.
కలెక్షన్ల మాయ...
మొదట ‘విశ్వాసం' ఫస్ట్ వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 75 కోట్ల కోట్లు రాబట్టినట్లు ప్రచారం జరిగింది. దానికి పోటీగా ‘పేట' రూ. 100 కోట్లు వసూలు చేసినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. తర్వాత విశ్వాసం రూ. 100 కోట్ల మార్కును మించిపోయినట్ల అభిమానులు కాంపోయిన్ మొదలు పెట్టారు.
అవి ఫేక్ కలెక్షన్లే అని తేల్చేసిన నిర్మాతలు
అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని, ఫేక్ నెంబర్స్ ఎవరూ నమ్మ వద్దంటూ ‘పేట' చిత్రాన్ని నిర్మించి సన్ పిక్చర్స్ ట్విట్టర్ ద్వారా స్పస్టం చేసింది.
|
ఇద్దరు హీరోల సినిమాలు ఎంజాయ్ చేయండి
ఇద్దరు హీరోల సినిమాలను అభిమానులు ఎంజాయ్ చేయాలని, కలెక్షన్ల గురించి అనవసరంగా గొడవ పడొద్దని, అందరూ ఈ పండగను సంతోషంగా జరుపుకోవాలని సన్ పిక్చర్స్ సంస్థ సూచించింది.
పేట, విశ్వాసం
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘పేట' చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ బేనర్లో కళానిధి మారన్ ఈ మూవీ నిర్మించారు. అజిత్ హీరోగా తెరకెక్కిన ‘విశ్వాసం' చిత్రాన్ని సిరుతై శివ దర్శకత్వంలో టిజి త్యాగరాజన్ నిర్మించారు.