»   » 'బాషా 2' విషయమై సురేష్ కృష్ణ స్పందన

'బాషా 2' విషయమై సురేష్ కృష్ణ స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై రజనీకాంత్‌ నటించిన 'బాషా' చిత్రంలోని ఈ పంచ్‌ డైలాగ్‌ని ప్రేక్షకులు మరచిపోలేరు. 1995లో వచ్చిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఇప్పటికీ ఆ చిత్ర కథన శైలి నుంచి స్ఫూర్తి పొందుతుంటారు రచయితలు. ఆ సినిమాకి సురేష్‌కృష్ణ దర్శకుడు.

అలాగే...సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కెరీర్‌ ని ఓ మలుపు తిప్పిన చిత్రం 'బాషా'. అదిరిపోయే ఫ్యాష్‌ బ్యాక్‌తో.. అప్పటివరకూ లేని కొత్తదనాన్ని ఆవిష్కరించారు. ట్రెండ్‌ సెట్టింగ్‌గా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందిచడానికి దర్శకుడు సురేష్‌కృష్ణ సన్నాహాలు చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సీక్వెల్‌ కథను ఇటీవల రజనీకాంత్‌కు కూడా వినిపించినట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Suresh Krishna Denies Baasha Sequel Plans

అయితే అందులో నటించడానికి సూపర్‌స్టార్‌ నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ కథను 'తల' అజిత్‌ చెవిలోకి తీసుకెళ్లారట సురేష్‌కృష్ణ. అజిత్‌ నటించడానికి ఒప్పుకున్నట్లు మంగళవారం ఉదయం నుంచి ప్రచారం సాగింది. వాస్తవానికి ఈ సినిమాలో అజిత్‌ నటించడం లేదని స్పష్టమైంది.

దీని గురించి సురేష్‌కృష్ణ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. 'బాషా 2' పై వస్తున్న కథనాలన్నీ అవాస్తవం. ఇందులో అజిత్‌ నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అయితే అజిత్‌తో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు. దీంతో బాషా 2 వదంతులకు దాదాపుగా ఎండ్ డాట్ పెట్టారు సురేష్‌కృష్ణ.

ఈ భాషా ఒక్కసారి చెపితే వంద సార్లు చెప్పినట్లు...అంటూ రజనీకాంత్ చెప్పే డైలాగుని మరిచిపోవటం కష్టమే. రజనీకాంత్ సూపర్ హిట్ భాషా లో ఇలాంటి కేక పుట్టించే డైలాగులు,సీన్స్ చాలా ఉన్నాయి. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన దర్శకుడు సురేష్ కృష్ణ కి కలిగిందీ. దాంతో ఆయన స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. అయితే తమిళంలో దాన్ని రజనీతో చేయటం లేదు. కన్నడంలో ప్లాన్ చేస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించే ఆలోచన చేసాడు. కానీ మెటిరియలైజ్ కాలేదని సమాచారం.

English summary
According to reports in famous dailies, Ajith will be acting in Baashah 2 which will be directed by Suresh Krishna who helmed the original with Superstar Rajinikanth. In a recent tweet, Suresh Krishna has said that he is happy whenever such news is popping up in media but sadly they aren’t true.
Please Wait while comments are loading...