For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూర్య ‘బ్రదర్స్’రిలీజ్ డేట్ పై నిర్మాత ప్రకటన

  By Srikanya
  |

  చెన్నై : సూర్య ద్విపాత్రాభినయంతో అవిభక్త కవలలుగా నటిస్తున్న'బ్రదర్స్'. గ్రీన్ స్టూడియో, శ్రీ సాయిగణేశ ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగులో ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ అందిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ డేట్ మార్చమని ఆడియో విడుదల రోజు బెల్లంకొండ స్టేజిపై రిక్వెస్ట్ చేసారు. కానీ మొదట అనుకున్నట్లుగానే అక్టోబర్ 12న విడుదల చేస్తున్నట్లు జ్ఞాన్‌వేల్ రాజా ప్రకటించారు. అలాగే తెలుగులో మొదటి సారిగా సూర్య చిత్రాన్ని భారీగా అంటే నాలగు వందల ధియోటర్స్ లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

  ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ- తొలిసారిగా సూర్య తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనీ, తమిళంలో 'మ్యాట్రన్'గా విడుదల అవుతోందని అన్నారు. ఐదు పాటలున్న ఈ చిత్రంలో స్క్రిప్ట్ సరికొత్తగా ఉంటుందనీ, 120 రోజులు షూటింగ్ చేసి పూర్తి స్థాయి హాలీవుడ్ చిత్రంలా దర్శకుడు కె.వి.ఆనంద్ నిర్మించారని ఆయన వివరించారు. టాప్ 10 మూవీస్‌లో 'బ్రదర్స్' చిత్రం నిలుస్తుందని దర్శకుడు కె.వి.ఆనంద్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

  సూర్య మాట్లాడుతూ... 'బ్రదర్స్'లో ప్రతి సన్నివేశంలో నటించ డం సరికొత్త అనుభవమే. నేను నటుడిగా రంగప్రవేశం చేసి 13 ఏళ్లు అయ్యింది. ఇప్పటివరకు 'బ్రదర్స్'లో పాత్రల తరహాలో నటించలేదు. ఇందులో కవలలుగా విరుద్ధ భావాలున్న పాత్రలు పోషించాను. ఒక పాత్ర పేరు అఖిళన్, మరో పాత్ర పేరు విమలన్. ఒకరు కమ్యూనిస్టు భావాలు కలవాడయితే, మరొకరు పూర్తి జాలీ టైప్. అయితే ఇద్దరూ హీరోలే. రెండు పాత్రల్లోనూ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఇక ఇందులో దర్శకుడి పని తీరు అద్భుతం. మాట్రాన్ చిత్రం కోసం కెవి ఆనంద్ ఎంతగా శ్రమించారో నాకు తెలుసు.

  దర్శకుడు కె.వి.ఆనంద్ మాట్లాడుతూ థాయిలాండ్‌కు చెందిన అవిభక్త కవలలను స్పూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం మాట్రాన్ అని తెలిపారు. ఈ కవలలు అమెరికా వెళ్లి ఒక సర్కస్ కంపెనీ ప్రారంభించి బాగా ఉన్నత స్థితికి చేరుకున్నారని శివాజీ చిత్ర షూటింగ్ సమయంలో ఫ్లైట్‌లో పయనిస్తుండగా ఒక మ్యాగజైన్‌లో చదివానన్నారు. అప్పుడే దీన్ని ఇతివృత్తంగా తీసుకుని చిత్రం చేద్దామని సూర్యతో చెప్పానన్నారు. ఆ విధంగా మాట్రాన్ తెరకెక్కిందని వివరించారు. ఒక పాట మినహా చిత్రం పూర్తి అయ్యిందని చెప్పారు. డబ్బింగ్ కూడా పూర్తి అయ్యిందని, ప్రస్తుతం గ్రాఫిక్స్ జరుగుతున్నాయని తెలిపారు.

  కాజల్, వివేక్, సచిన్ కేడెకర్, తార, రవిప్రకాష్, శంకర్ కృష్ణమూర్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జైరాజ్, మాటలు: శశాంక్ వెనె్నలకంటి, కెమెరా: ఎస్.సౌందర్యరాజన్, ఎడిటింగ్: ఆంథోని, పాటలు: చంద్రబోస్, వనమాలి, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు, సమర్పణ: కె.ఇ.జ్ఞాన్‌వేల్ రాజా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.ఆనంద్.

  English summary
  Surya's Brothers is getting ready for release. "We are releasing the film on October 12th. No change in the release date. It will be released in more than 400 theaters across the Andhra Pradesh as it is biggest movie in Surya's career," said producer Jnanavel Raja. Surya plays the role of conjoined twins in the movie and it is being directed by K V Anand whose recent film, Rangam, was a big hit in Andhra Pradesh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X