»   » మళ్ళీ దెయ్యంగా తమన్నా

మళ్ళీ దెయ్యంగా తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఈ మద్యనే బాహుబలిలో తన అందంతో అందరి మతులు పోగొట్టే తమన్నా త్వరలో ...ఓ హర్రర్ చిత్రం కమిటవ్వబోతోందని చెన్నై వర్గాల సమాచారం. అంతేకాకుండా ఆమె పాత్ర దెయ్యం అని చెప్తున్నారు. గతంలో ఆమె రామ్ హీరోగా వచ్చిన ఎందుకంటే ప్రేమంట చిత్రంలోనూ దెయ్యంగా కనిపించింది. ఆ చిత్రం ఫ్లాఫ్ అయ్యింది. దాంతో ఆమె మరోసారి దెయ్యంగా కనిపించనుందంటే ఆమె అభిమానులు కంగారుపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెండ్ దెయ్యల సీజన్ జోరుగా నడుస్తోంది. ఇప్పుటికే త్రిష, హన్సికల నుంచి రాయ్‌లక్ష్మి,లక్ష్మిమీనన్ వరకు హార్రర్ చిత్రాల్లో నటించేసారు. అదే కోవలో తమన్నా కూడా దెయ్యంగా కనిపించబోతోందని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

Tamanna as a Ghost?

గతంలో ఆసామి, ఇన్నారుక్కు ఇన్నారెండ్రు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఆండాళ్ రమేశ్ ఈ హర్రర్ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. ఇది హార్రర్ కథా చిత్రం అయినా ఇప్పటి వరకూ ఎవరూ చూడని కథ అంటున్నారు. ముఖ్యంగా ఈ కొత్త చిత్రంలో దెయ్యమే హీరో అని తెలిపారు. హీరోయిన్ కూ ప్రాముఖ్యత ఉంటుందని చెప్తున్నారు.ఆ పాత్రకు తమన్నా అయితే బాగుంటుందని భావించి కలుస్తాము అన్నారు.

అంతేకాకుండా తమన్నా సైతం... ఇంతకు ముందు హార్రర్ సినిమాలో నటించాలనే ఉందని మీడియాతో అన్నారని ,అందువల్ల తమన్నాతో చర్చలు జరుపుతున్నామని అన్నారు.

ఈ కొత్త దెయ్యం సినిమాలో నాజర్, కోవైసరళ, సంతాన భారతి ముఖ్యపాత్రలు పోషించనున్నారని, చిత్ర షూటింగ్ సంక్రాంతి తరువాత ప్రారంభం అవుతుందని తెలిపారు. తమన్నా ప్రస్తుతం తమిళంలో శీను రామసామి దర్శకత్వంలో విజయ్‌సేతుపతికి జంటగా ధర్మదురై చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది.

దర్శకుడు ఆండాళ్ రమేష్ విషయానికి వస్తే...ఆయన 2012లో డైరక్ట్ చేసిన ఆసామి తమిళ ప్రభుత్వ అవార్డులకు ఎంపికైన 12 చిత్రాల్లో ఒకటిగా చోటు సంపాదించుకుంది. దొంగస్వాముల మోసాలకు ప్రజలు గురి కావద్దు అన్న సందేశంతో రూపొందించిన చిత్రం. మరి ఈ దెయ్యం సినిమాలో ఏ సందేశం ఇస్తారో లేక భయపెట్టడమే పనిగా పెట్టుకుంటారో చూడాలి.

English summary
Director Andal Ramesh who has earlier directed films including Aasamy, Innarukku Innarendru is ready with his next project as a ghost story.In this movie Thamanna will be a Ghost.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu