»   » అక్కడ తమన్నా అభిమానుల పాలాభిషేకం

అక్కడ తమన్నా అభిమానుల పాలాభిషేకం

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమన్నా తాజా చిత్రం పయ్యా రిలీజ్ సందర్భంగా యాభై అడుగల తమన్నా కట్ అవుట్ ని పెట్టి పాలాభిషేకం చేసారు ఆమె అభిమానులు. తమిళనాడులోని టుట్టికారన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఆల్ ఇండియా తంగ పదమయి తమన్నా ఫ్యాన్ క్లబ్ ఒకటి ఏర్పాటయింది. వారు ఈ పాలాభిషేకోత్సవాన్ని చేసారు. అయితే ఈ విషయాన్ని తమన్నా ఖండిస్తోంది. తనకు ఫ్యాన్స్ అశోసియేషన్ ఉందని తెలియదని, అయినా ఇలాంటి అభిషేకాలు తనకు ఇష్టం ఉండవని క్లియర్ గా చెప్తోంది. అంతగా ఇంట్రస్టుగా ఉంటే మరోసారి సినిమా చూడాలి గానీ ఇలా హోర్డింగ్ లు పెట్టడం వంటివి తనకు ఇష్టముండవని తేల్చిచెప్పింది. అలాగే అభిషేకాలు వంటివి భగవంతుడుకి చేయాలి కానీ తనకు చేయకూడదని ఫ్యాన్స్ కు హితవు పలికింది. ఇదిలా ఉండే ఆమెకు గుడి కడతామంటూ మరో ప్రపోజల్ వచ్చింది. దాంతో ఆమె అభిమానానికి హద్దులు ఉండాలి అని చెప్తోంది. ఇక ఇంతకు ముందు ఖుష్బూ, నమితలకు గుడి కడితే, రజనీకాంత్ వంటి స్టార్స్ కి పాలాభిషేకాలు చేసిన సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu