For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దేవిశ్రీప్రసాద్ స్టూడియో లో తమన్న చిత్రం ప్రారంభం

  By Srikanya
  |

  చెన్నై: తమన్నా మరో చిత్రం ప్రారంభమైంది. విజయ ప్రొడక్షన్ పతాకంపై బి.నాగిరెడ్డి ఆశీస్సులతో బి.వెంకటరామిరెడ్డి సమర్పణలో భారతి రెడ్డి నిర్మిస్తున్న భారీ చిత్రంలో ఈ చిత్రంలో అజిత్ హీరోగా నటించనున్నారు. రవితేజతో దరువు చేసిన శివ దర్శకత్వం వహించనున్నారు. దేవిశ్రీప్రసాద్ స్టూడియోలో ఈ చిత్రం పూజ సింపుల్ గా జరిగింది.

  ఇందులో అజిత్ సరసన నటించే హీరోయిన్ అవకాశాన్ని నటి తమన్న కొట్టేయటం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

  దేవిశ్రీప్రసాద్ ఈ విషయమై ట్వీట్ చేస్తూ... "దర్శకుడు శివ,అజిత్ ల చిత్రం నా స్టూడియోలో జరగటం చాలా ఆనందంగా ఉంది. శివ చెప్పిన స్టోరీ నేరేషన్ చాలా బాగుంది.చిత్రం మంచి విజయం సాధిస్తుంది!! )" అన్నారు.

  ఇటీవల టాలీవుడ్‌లో బిజీగా ఉన్న తమన్న కోలీవుడ్‌లో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.అలాంటి అవకాశం అజిత్ చిత్రం రూపంలో వచ్చింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మార్చిలో సెట్‌పైకి రానుంది. అయితే పాటల రికార్డింగ్ కార్యక్రమం బి.నాగిరెడ్డి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించారు. ఇందులో విదార్ద్, మునీష్, సొహైల్ నటించనుండగా, జయరాం, సంతానం హాస్య భూమికలను పోషించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ విజయ ప్రొడక్షన్స్ సంస్థలో దర్శకత్వం వహించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది అజిత్ అభిమానుల్ని సంతృప్తి పరిచే చిత్రంగా ఉంటుందని దర్శకుడు శివ తెలిపారు.

  కార్తీతో 'సిరుత్త్తె' లాంటి భారీ ప్రాజెక్టు రూపొందించిన శివ దర్శకత్వంలో అజిత్‌ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా, మాస్ ప్రేక్షకులను అలరించేదిగా ఉంటుందని చెప్తున్నారు. శివ తెలుగులో రీసెంట్ గా దరువు చిత్రం చేసారు. తాప్సీ, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. యమలోకం నేపధ్యంలో రూపొందిన ఆ చిత్రం సోషియో ఫాంటసీ అయినా ప్రేక్షకులకు ఆ మేరకు వినోదం పంచలేకపోయింది. అరవ వాసన ఎక్కువైందని విమర్శులు రావటం కూడా సినిమాకు మైనస్ గా మారింది. దాంతో శివ తన మకాంని తమిళంకు మార్చారు.

  అజిత్‌ ప్రస్తుతం వరుసపెట్టి చిత్రాలు చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లోనే కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. ఎలాంటి వెన్నుదన్ను లేకుండా వెండితెరపైకి వచ్చి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎవరి కోసమూ తన వ్యక్తిత్వాన్ని వదులుకోని అజిత్‌ తనకెంతో ఇష్టమైన బైక్‌రేస్‌లకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ కారణంగా ఒకదశలో ఆయన సినిమాల మధ్య చాలా విరామమే వచ్చింది. అయితే అభిమానులు, నిర్మాతలను దృష్టిలోకి తీసుకుని తన పంథా మార్చుకున్నాడు. పూర్తిగా వెండితెరకే అంకితమైపోయాడు.

  English summary
  The pooja of Thala Ajith- Tamanna forthcoming project held in a simple manner in the tech-tuned studio of composer Devi Sri Prasad on the backstreets of Vadapalani, Chennai. Actress Tammanna has been roped to play the female lead opposite Ajith while the comedy portion will be handled by Santhanam. Devi Sri Prasad, the composer of the film, is smiling from ear to ear. The musician, who has shared the pooja photos,said, “With Director Shiva at the pooja of Thala Ajith’s new film in my studio..!! Loved the narration of Mr.Shiva’s story.!!,!! )”
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X