»   »  టాప్ డైరక్టర్ , ఆయన కుమార్తె పై చెక్‌ బౌన్స్‌ కేసు

టాప్ డైరక్టర్ , ఆయన కుమార్తె పై చెక్‌ బౌన్స్‌ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ప్రముఖ తమిళ సినీ దర్శకుడు చేరన్‌, ఆయన కుమార్తె నివేద ప్రియదర్శిలపై పరమకుడి కోర్టులో చెక్కు బౌన్స్‌ కేసు దాఖలైంది. ఈ నెల 30వ తేదీ ఆ ఇద్దరు న్యాయస్థానంలో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వివరాల్లోకి వెళితే చేరన్‌ ఆయన కుమార్తె నివేద ప్రియదర్శినిలు 'సీ2హెచ్‌' క్యాసెట్ల విక్రయ సంస్థను నిర్వహిస్తున్నారు. పరమకుడి, పార్తిబనూర్‌, ముత్తుకుళత్తూరు, కముది, అభిరామం తదితర ప్రాంతాల్లో క్యాసెట్ల విక్రయ హక్కులను పళముత్తునాథన్‌ పొందారు. ఇందుకోసం ఆయన సీ2హెచ్‌కు రూ.80 వేల డిపాజిట్‌ చెల్లించారు.

Tamil Director Cheran and his Daughter Under a Case for Bounced Cheque

ఆ సంస్థ నిర్వహణ తీరు సరిగాలేదని భావించిన ఆయన తన డిపాజిట్‌ను తిరిగి చెల్లించాలని కోరగా అతడికి చేరన్‌, ప్రియదర్శినిలు జూన్‌ 27న చెక్కు ఇచ్చారు. అది జులై 10న బ్యాంకులో జమ చేయగా డబ్బులు లేక బౌన్స్‌ అయింది.

దాంతో పళముత్తునాథన్‌ పరమకుడి కోర్టులో చేరన్‌ ఆయన కుమార్తె నివేదపై చెక్కు బౌన్స్‌ కేసు దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి ఇన్బకార్తికేయన్‌ చేరన్‌, ప్రియదర్శినిలు ఈ నెల 30వ తేదీ న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించారు.

English summary
A case was filed against top Tamil Director Cheran and his daughter who created a new trend in Tamil Industry with their business C2H for issuing a bounced cheque to their business customers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu