Just In
- 3 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 4 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 5 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 6 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
14 గెటప్పులతో విక్రమ్ చిత్రం
విక్రమ్ తాజా చిత్రం రాజపాట్టైలో ఆయన ఈ సారి 14 గెటప్‌లలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు సుశీంద్రన్ మీడయాకు తెలియచేస్తూ... ఇది పక్కా మాస్ చిత్రం, విక్రమ్ జిమ్ బాయ్‌గా నటిస్తున్నారు. ఆయన 14 గెటప్‌లలో కనిపిస్తారు. క్లైమాక్స్ కోసం కళా దర్శకుడు రాజీవ్‌మీనన్ బ్రహ్మాండమైన సెట్ రూపొందించారు. యువన్ శంకర్ రాజా సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది అని చెప్పుకొచ్చారు. అలాగే చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు. తదుపరి తమిళం, తెలుగు భాషలలో వీర ధీర శూరన్ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. తమిళ్ వెర్షన్‌లో విష్ణు హీరోగా నటించనున్నారని అన్నారు. ఇక దర్శకుడుగా మొదటి సినిమాతోనే హిట్ పొందిన దర్శకుడు సుశీంద్రన్. ఆయన దర్శకత్వ శైలి ప్రతి చిత్రానికీ కొత్తగా ఉంటుంది. వెన్నిలా కబడికుళు, నాన్ మహాన్ అల్ల, అళగర్ సామియన్ కుదిరై తదితర మూడు సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించారు.
ప్రస్తుతం విక్రమ్ హీరోగా రాజపాట్టై చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దీక్షాసేథ్ తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఈ క్లైమాక్స్ ని ఎనిమిది రోజులు పాటు చిత్రీకరించారు. యవన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ కి విడుదల అవుతోంది.ఇక గతంలో విక్రమ్ నటించిన నాన్న చిత్రం కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు.విమర్శకుల ప్రశంసలు అందుకున్నా అనుకున్న రేంజిలో విక్రమ్ కి పేరు తేలేదు. దాంతో నిరాశలో ఉన్న విక్రమ్ ఈ చిత్రంపైనే పూర్తి దృష్టి పెట్టారు. ఇక దీక్షాసేధ్ విషయానికి వస్తే... గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న నిప్పులో కూడా ఆమె నటిస్తోంది.ఈ చిత్రాన్ని మరో దర్శకుడు వైవియస్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇక ఆమె నిప్పు లో కాకుండా ...లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రెబల్" లక్ష్మిప్రసన్న నిర్మాతగా మనోజ్‌తో 'ఊ కొడతార ఉలిక్కి పడతారా" చిత్రాలలో నటిస్తోంది.