»   » స్టార్ కమిడియన్ పై నిర్మాత పోలీస్ కంప్లైంట్...

స్టార్ కమిడియన్ పై నిర్మాత పోలీస్ కంప్లైంట్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ కమిడయన్ వడివేలుపై తమిళ నిర్మాత ఆర్.కన్నన్ పోలీస్ కంప్లైంట్ శనివారం సాయింత్రం ఇచ్చారు. ఆ కంప్లైంట్ లో తన కూతురు పుట్టినరోజు పంక్షన్ జరుపుకుంటున్న సమయంలో వడివేలుకు చెందిన కొందరు వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి గొడవ చేశారని పేర్కొన్నారు. అలాగే తన మామగారిని అనరాని మాటలతో బూతులు తిట్టారని...దానికి కారణం తను కామిడీ నటుడు సింగముత్తుని ఆహ్వానించటమేనని పేర్కొన్నారని ఆయన తెలిపారు. ఇంటిపై రాళ్లు రువ్వడంతో కుటుంబ సభ్యుడైన ద్రావిడ సెల్వంకు గాయాలయ్యాయని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు.

అలాగే వడివేలు మద్దతుదారుల నుంచి తనకు ప్రాణాపాయం ఉందని, అందుకే తనకు, తన ఇంటికి రక్షణ కల్పించాలని కన్నన్‌ పోలీసులను కోరారు. నగరంలోని విరుగంబాక్కంలో వడివేలు ఇంటి ఎదురుగా ఉన్న కన్నన్‌ నాంగపుదుసా అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన శనివారం పోలీసు కమిషనర్‌ రాజేంద్రన్‌కు ఒక వినతిపత్రం అందజేశారు. ఇటీవల తన కుమార్తె పుట్టిన రోజు పండుగ చేశామని, దీనికి సింగముత్తు, అతని స్నేహితులు వచ్చారని తెలిపారు. సింగముత్తు అక్కడకు రావడంతో వడివేలు తన ఇంటికి రక్షణ కల్పించాలని విరుగంబాక్కం పోలీసులను కోరారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పోలీసులు తమ ఇంటికి వచ్చి విచారించారని తెలిపారు. ఇక నటులు వడివేలు, సింగమత్తుకు మధ్య ఆస్తులకు సంబంధించి గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu