ప్రముఖ తెలుగు నటి అశ్విని మృతి

కృష్ణ హీరోగా నటించిన వజ్రాయుధం, కొడుకు దిద్దిన కాపురం, శోభన్‌బాబు నటించిన శ్రీవారు, రాజేంద్రప్రసాద్ సరసన పెళ్లిచేసి చూడు, వివాహ భోజనంబు, కల్యాణచక్రవర్తితో ఇంటిదొంగ ఇంకా స్టేషన్ మాస్టర్, చూపులు కలిసిన శుభవేళ, ఆమె వేగుచుక్క పగటి చుక్క, నీకు నాకు పెళ్లంట, అరణ్యకాండ, బాలమురళి ఎంఎ, అమెరికా అబ్బాయి తదితర చిత్రాల్లో నటించారు. తమిళంలో పార్తీబన్ సరసన పొండాటి తేవై తదితర చిత్రాల్లో నటించారు. నెల్లూరుకు చెందిన అశ్విని నటిగా స్థిరపడిన తర్వాత చెన్నైలోనే నివసిస్తున్నారు.
సినిమా అవకాశాలు తగ్గడంతో తెలుగు సీరియల్స్ చేస్తున్నారు. ఇటీవలే తెలుగులో ఒక కొత్త సీరియల్‌లో నటించేందుకు సిద్ధమైనా అనారోగ్య కారణాలతో వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. ఆమెకు తెలుగు సినీ దర్శకునితో వివాహమై ఒక కుమారుడు ఉన్నట్లు తెలిసింది. అశ్వని భౌతికకాయాన్ని ఆదివారమే ఆమె సొంతూరైన నెల్లూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.


Click it and Unblock the Notifications











