twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బులేకే... దర్శకుడు, నటుడు రాజశేఖర్ మరణం వెనక దిగ్బ్రాంతికర నిజం!

    |

    ప్రముఖ తమిళ డైరెక్టర్, నటుడు రాజశేఖర్ (62) ఆదివారం కన్నమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజశేఖర్.. ఇటీవలే చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌లో చేరారు. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 8వ తేదీన తుదిశ్వాస విడిచారు.

    రాజశేఖర్ మరణం తమిళ సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టివేసింది. దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన పలైవనచొలై, చిన్నపూవే మెళ్ల పెసు వంటి సూపర్ హిట్ సినిమాలను డెరెక్ట్ చేశారు. రాజశేఖర్ చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థి. భారతీరాజా దర్శకత్వం వహించిన నిజాల్గల్ (1980) సినిమాతో ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలు పెట్టారు.

    ట్రీట్మెంటుకు సరిపడా డబ్బు లేవు

    ట్రీట్మెంటుకు సరిపడా డబ్బు లేవు

    రాజశేఖర్ భార్య సారా తాజాగా ఓ దిగ్బ్రాంతికర విషయం వెల్లడించారు. తన భర్త కొన్ని రోజుల క్రితమే శ్వాస సంబంధమైన ఇబ్బందులతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని, ఆ సమయంలో తమ వద్ద చికిత్సకు సరిపడే డబ్బు కూడా లేదని, డబ్బు లేని కారణంగానే సరైన చికిత్స తీసుకోలేకపోయారని వెల్లడించారు.

    ఆయన సహాయం చేశారు కానీ సరిపోలేదు

    ఆయన సహాయం చేశారు కానీ సరిపోలేదు

    రాజశేఖర్ నటిస్తున్న ఓ సీరియల్‌కు దర్శకత్వం వహిస్తున్న విక్రమ్ ఆదిత్య చికిత్స కోసం కొంత డబ్బు సహాయం చేశారని, అయితే అది చికిత్సకు సరిపడేంత కాదు అని సారా వెల్లడించారు. తమ వద్ద తగినంత డబ్బు ఉండి మంచి ట్రీట్మెంట్ అందితే తన భర్త ఆరోగ్యం బావుండేది అని తెలిపారు.

    పరిస్థితి తెలిసి అంతా విస్మయం

    పరిస్థితి తెలిసి అంతా విస్మయం

    డబ్బు లేని కారణంగా సరైన చికిత్స తీసుకోక రాజశేఖర్ మరణించారని తెలిసి పలువురు విస్మయానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉందని ముందే తెలిసి ఉంటే బహుషా ఎవరైనా సహాయం చేసి ఉండే వారనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

    తన సహచరుడితో కలిసి

    తన సహచరుడితో కలిసి

    సినిమాటోగ్రాఫర్‌ రాబర్ట్‌ సహచర్యం వల్లే ఆయన దర్శకుడిగా మారానని అంతా చెబుతుంటారు. వీరి కాంబినేషన్లో వచ్చిన 'ఒరు తాలై రాగం', 'మనసుక్కుల్ మతప్పు' చిత్రాలకు మంచి పేరొచ్చింది. రెండేళ్ల క్రితం రాబర్ట్ కన్నుమూశారు.

    English summary
    Veteran actor-director Rajasekhar's death has plunged the Tamil film industry into tragedy. But one thing Rajasekhar's wife said was shocking. She said her husband, who was ill, was not getting better treatment as he did not have enough money to treat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X