»   » హిందీ పాట రీమిక్స్ లో ... : స్టార్ కమిడయన్ తో సదా చిందులు

హిందీ పాట రీమిక్స్ లో ... : స్టార్ కమిడయన్ తో సదా చిందులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : 22 వ పులకేసి చిత్రంలో హీరోగా మారిన తమిళ కమిడయన్ వడివేలు...వరసగా హీరోగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా 'వైగై పుయల్‌' వడివేలు నటిస్తున్న తాజా చిత్రం 'ఎలి'. యువరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సిటీ సినీ క్రియేషన్స్‌ బ్యానరుపై సతీష్‌కుమార్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇందులో విశేషమేమిటంటే...సదా హీరోయిన్. అంతేకాకుండా ఈ కాంబినేషన్ ఓ ప్రత్యేకమైన పాటను చిత్రీకరించారు. అదేమిటంటే...1969లో రాజేష్‌ఖన్నా, షర్మిల జోడీగా నటించిన 'ఆరాధన' చిత్రంలోని 'మేరే స్వప్నోంకి రాణి' అనే పాటను ఇందులో రీమేక్‌ చేశారు.

Vadivelu in place of Bollywood Superstar

ఈ పాటను అధికారికంగా హక్కులు సొంతం చేసుకుని ఇందులో వినియోగించినట్లు చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవలే ఈ పాట చిత్రీకరణను పూర్తి చేశారు. ఓ తమిళ సినిమాలో పూర్తి హిందీ పాట ఉండటం ఇదే ప్రథమమని సమాచారం.

త్వరలోనే సూపర్‌ సుబ్బరాయన్‌ సమక్షంలో హాస్యపూరిత పోరాట సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. సినిమాలకు ఇవి ప్లస్‌పాయింట్‌గా ఉంటాయని చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. 'టాకింగ్‌ టామ్‌' మాదిరిగా 'టాకింగ్‌ ఎలి' పేరిట ఇటీవల ఓ యాప్‌ను విడుదల చేసినట్లు తెలిపాయి. ఈనెలాఖరులో పాటలను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

చిత్రం విషయానికి వస్తే...

జయం అపరిచితుడు చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితురాలైంది సదా. ఈ సినిమాలతో కథానాయికగా చక్కటి గుర్తింపును సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు పరాజయాల బాట పట్టడంతో అచిరకాలంలోనే స్టార్‌ఇమేజ్‌కు దూరమైంది. కొంతకాలంగా ప్రత్యేక గీతాలు, అతిథి పాత్రలకే పరిమితమవుతూ వస్తోన్న ఆమె ఎనిమిదేళ్ల విరామం తర్వాత కథానాయికగా తమిళంలో రీఎంట్రీ ఇవ్వనుంది.

Vadivelu in place of Bollywood Superstar

హాస్యనటుడు వడివేలు హీరోగా ఎలి పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. యువరాజ్ దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సదా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో వడివేలు కలల సుందరిగా ఆమె పాత్ర చాలా ఆసక్తికరంగా సాగుతుంది చిత్రబృందం వెల్లడించింది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

సదా మాట్లాడుతూ కథల ఎంపికలో జరిగిన కొన్ని పొరపాట్ల వల్లే కెరీర్‌లో గ్యాప్ ఏర్పడింది. మళ్లీ అలాంటి తప్పులను పునరావృతం చేయకూడదనే అవకాశాలు వచ్చినా మంచి కథ కోసం ఇన్నాళ్లపాటు ఆగాను. ఈ చిత్ర కథ నన్ను బాగా ఆకట్టుకుంది. నటనకు ఆస్కారమున్న పాత్రలో నటిస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాతో కథానాయికగా పూర్వవైభవాన్ని పొందుతాననే నమ్మకముంది అని చెప్పింది.

English summary
The entire shooting of Vaigai Puyal Vadivelu’s ‘Eli’ is over and post production work is on in full swing while the audio is set to release shortly. Comedy King alongwith heroine Sada has danced for the classic Hindi song ‘Mere Sapnon ki Rani’ in place of Superstar Rajesh Khanna and Sharmila Tagore. The producers have procured the rights for the song from ‘Aradhana’ and this is the first time a full Hindi song is being used in a Tamil film.
Please Wait while comments are loading...