»   » టాలీవుడ్‌కి ‘జర్నీ’ దర్శకుడి ‘ఛాలెంజ్’

టాలీవుడ్‌కి ‘జర్నీ’ దర్శకుడి ‘ఛాలెంజ్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సమ్మర్ లో ‘వలియవన్' పేరుతో తమిళంలో విడుదలైన భారీ విజయాన్ని సొంతం చేసుకుని, మంచి కలెక్షన్స్ సాధించిన చిత్రాన్ని తెలుగులో ‘ఛాలెంజ్' పేరుతో విడుదల చేస్తున్నారు. ‘జర్నీ' సినిమా సక్సెస్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో జై హీరోగా నటిస్తున్నారు.

తమిళంలో ఘనవిజయాన్ని సాధించిన ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కుల కోసం చాలా మంది నిర్మాతలు పోటీపడినప్పటికీ గోపిచంద్ పండగ ఈ చిత్ర రీమేక్ హక్కులను పొందారు. జై మారుతి పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ చిత్రంలో ఆండ్రియా హీరోయిన్ గా నటించింది.

 Valiyavan dubbed in telugu as Challenge

‘జర్నీ' సినిమాని డైరెక్ట్ చేసిన ఎమ్.శరవణన్ ఈచిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో ఓ యువకుడు తన ఫ్యామిలీ కోసం, లక్ష్యం కోసం ఏం చేసాడనేదే కథ. ఈ సినిమా కోసం హీరో జై సిక్స్ ప్యాక్ పెంచాడు. ‘జర్నీ' తర్వాత శరవణన్, జై కాంబినేషన్ లో వచ్చిన ఈ సక్సెస్ ఫుల్ మూవీ ప్రస్తుతం తెలుగులో డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

త్వరలోనే డి.ఇమ్మాన్ సంగీతం అందించిన ఆడియా విడుదల చేసి, ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

Read more about: tollywood, jai
English summary
Valiyavan dubbed in telugu as Challenge. Valiyavan is a 2015 Tamil action film written and directed by M. Saravanan. It features Jai and Andrea Jeremiah in the lead roles. The film commenced shoot from May 2014, and released on 27 March 2015.The film received mixed to negative reviews.
Please Wait while comments are loading...