రాత్రి జరిగిందిదే.. అది ఆత్మహత్య కానే కాదు.. నటి మృతిపై వనిత విజయ్ కుమార్ సెన్సేషనల్ ట్వీట్
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. వీజే, సీరియల్ నటి చిత్ర (28) మరణంతో కోలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. అయితే ఇది ఆత్మహత్య అని ప్రాథమికంగా బయటకు వచ్చినా కూడా మరి కొన్ని కోణాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగి, అతనితో పాటే హోటల్‌లో ఉంటోన్న చిత్ర నేటి ఉదయం మరణించింది. అయితే చిత్ర మరణంపై వనిత విజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేసింది.

సీరియల్‌తో ఫేమస్..
పాండియన్ స్టోరీస్ అనే సీరియల్‌లు ముల్లై అనే పాత్ర ద్వారా బాగా ఫేమస్ అయింది. యాంకర్, వీజేగా మెల్లిగా కెరీర్‌ను మొదలుపెట్టిన చిత్ర.. సీరియల్స్‌తో ఫేమస్ అయింది. అయితే ఇలా చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలను వెళ్లడంతో ఆమె అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఆత్మహత్య..?
నటి చిత్ర కాబోయే భర్త హేమంత్‌తో ఓ హోటల్‌లో ఉంటోంది. నేటి ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాలకు షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చిన చిత్ర.. రెడీ అయి వస్తానని చెప్పి బయటకు రాలేదంట. అసలు ఏం జరుగుతోందని నకిలీ కీతో డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఆత్మహత్య చేసుకుని ఉందని హేమంత్ పోలీసులకు వివరించినట్టు తెలుస్తోంది.

ఏదో జరిగి ఉంటుందనే అనుమానాం..
చిత్ర మరణంపై వనిత విజయ్ కుమార్ స్పందించింది. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే వార్త.. ఈ ఏడాదిలో మరో షాకింగ్ న్యూస్. చిత్రకు జరిగింది నమ్మలేకపోతోన్నాను.. గత వారమే నా షోలో చిత్ర గెస్ట్‌గా పాల్గొంది. ఎంతో మంచిది.. బోల్డ్.. హ్యాపీ గర్ల్, ఆమె సూసైడ్ చేసుకునేంత బలహీనురాలు కాదని అనిపిస్తోంది.. అందులో ఏదో జరిగి ఉంటుందనే అనుమానాలను వనిత వ్యక్తం చేసింది.
Recommended Video

రాత్రి అలా..
గత రాత్రి ఆమె స్టార్ మ్యూజిక్ కోసం షూటింగ్ చేస్తోంది. దాని పక్కనే నా షో సెట్ కూడా ఉంది. నేను కూడా ఉదయం రెండు గంటల 30నిమిషాలకు వరకు అక్కడే ఉన్నాం.. కలిసేవెళ్లాం.. ఆమె కారును డ్రైవ్ చేసుకుంటూ ఆమె హోటల్‌కు వెళ్లిపోయింది.. అలాంటిది ఆమె ఆత్మహత్య చేసుకుందా?.. అది సూసైడ్‌లా కనిపించడం లేదు.. ఎంతో కలత చెందాను.. నా కళ్లల్లో ఇంకా ఆమె మెదులుతూనే ఉంది.. ఎంతో బాధగా ఉందని వనిత ఎమోషనల్ అయింది.


Click it and Unblock the Notifications











