రమ్యకృష్ణ ముఖంపైనే వనితా విజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు.. నువ్వు నాకు పాఠాలు చెప్పకు.. శివగామి ఫైర్!

తమిళ టెలివిజన్ రంగంలో మంచి టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకొంటున్న బీబీ జోడిగల్‌ తాజా ఎపిసోడ్ హాట్ హాట్‌గా మారింది. ఈ షోకు శివగామి రమ్యకృష్ణ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్, జడ్జి రమ్యకృష్ణకు మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది. ఈ షోలో వారిద్దరి మధ్య వాగ్వాదానికి కారణం ఏమిటంటే...

బాబోయ్ ఏంటా అందాలు: ఫిట్‌నెస్ మోడల్ అదితి మిస్త్రీ వైరల్ (ఫోటోలు)

కాళికామాత అవతారంలో వనితా విజయ్‌కుమార్

కాళికామాత అవతారంలో వనితా విజయ్‌కుమార్

తమిళ బిగ్‌బాస్‌లో టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రముఖులను జోడిగా చేసి బీబీ జోడిగల్ డ్యాన్స్ రిలేటెడ్ షోను డిజైన్ చేశారు. ఈ షోలో వనితా విజయ్ కుమార్‌కు జోడిగా సురేశ్ చక్రవర్తి ఉన్నారు. తాజా ఎపిసోడ్‌లో భయానక రసం నేపథ్యంగా వనితా విజయ్ కుమార్ కాళికామాత అవతారంలో ఫెర్ఫార్మెన్స్ చేశారు.

Leaked Shocking Pictures of Indian Celebs Photos

సూపర్ గెటప్.. మేకప్ అంటూ

సూపర్ గెటప్.. మేకప్ అంటూ

వనితా విజయ్ కుమార్ ఫెర్ఫార్మెన్స్‌ను చూసిన తర్వాత రమ్యకృష్ణ స్పందిస్తూ.. గెటప్ సూపర్, మేకప్ సూపర్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. మరో జడ్జి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ స్టెప్పుల్లోనే ఏదో తేడా కనిపించింది. సరిగా డ్యాన్స్ చేయలేదు అంటూ కామెంట్ చేశాడు. దాంతో కొరియోగ్రాఫర్‌ను పిలుస్తాను ఉండండి అంటూ వనితా విజయ్ కుమార్ అనడం కనిపించింది.

Photos: Actress Caught Smoking On & Off Screen

సహనం కోల్పోయిన వనితా విజయ్ కుమార్

సహనం కోల్పోయిన వనితా విజయ్ కుమార్

ఆ తర్వాత రమ్యకృష్ణ, మరో జడ్జితో జరిగిన వాదన మరోస్థాయికి చేరింది. ఓ దశలో సహనం కోల్పోయిన వనితా విజయ్ కుమార్ స్పందిస్తూ.. దయచేసి కంటెస్టెంట్ల పెర్ఫార్మెన్స్‌ను పోల్చి చూడవద్దు అంటూ కామెంట్ చేసింది. దాంతో మేము ఎలా జడ్జ్ చేయాలో మాకు నేర్పించవద్దు అంటూ రమ్యకృష్ణ ఘాటుగా స్పందించింది. దాంతో మీరు జడ్జిమెంట్ ఇవ్వడం లేదు. మీ సొంత అభిప్రాయాలు చెబుతున్నారు అంటూ వనితా విజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.

రమ్యకృష్ణ ఆగ్రహం

రమ్యకృష్ణ ఆగ్రహం

వనితా విజయ్ కుమార్ మాటలపై సహనం కోల్పోయిన రమ్యకృష్ణ ఆమె మాటలకు అభ్యంతరం చెప్పారు. ఇది కాంపిటీషన్. ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్‌ను పోల్చకుండా జడ్జిమెంట్ ఇవ్వలేం. ఇది కొత్త కాదు. ఎప్పుడూ జరిగేదే అంటూ రమ్యకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో వేరే ఆర్టిస్టు చేసిన దానికి, నేను చేసిన ఫెర్ఫార్మెన్స్‌కు ఎలాంటి తేడా లేదు అంటూ వనితా విజయ్ కుమార్ అంతే ఘాటుగా సమాధానం చెప్పింది

Recommended Video

Vanitha Vijayakumar, Peter Paul Marriage BREAK UP మూడో మొగుడ్ని కూడా తరిమేసిన వనితా విజయ్‌కుమార్
వనితా విజయ్ కుమార్ వాకౌట్

వనితా విజయ్ కుమార్ వాకౌట్

రమ్యకృష్ణ మరో జడ్జి చేసిన వ్యాఖ్యలకు సంతృప్తి చెందని వనితా విజయ్ కుమార్ తాజా ఎపిసోడ్ నుంచి వాకౌట్ చేశారు. వనితా విజయ్ కుమార్ స్టేజి మీద నుంచి వెళ్లిపోతుండటాన్ని చూసిన రమ్యకృష్ణ.. నాకే ఇబ్బంది లేదు.. నా జడ్జిమెంట్ గురించి నా హృదయానికి తెలుసు. మనస్పూర్తిగా నేను తీర్పు చెప్పాను. నేను పక్షపాతం చూపించడం లేదు. జడ్జిమెంట్ ఇవ్వాలో నాకు నేర్చించకు అంటూ రమ్యకృష్ణ అరవడం కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X