For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అందుకే మూడు పెళ్ళిళ్ళు.. నిజాలు బయట పెట్టిన వనిత విజయ కుమార్!

  |

  గత ఏడాది తమిళ బిగ్‌బాస్‌3లో పాల్గొన్న వనిత విజయ్ కుమార్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సీనియర్ నటుడు విజయ్ కుమార్, సీనియర్ నటి మంజుల సినీ వారసురాలిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన వనిత, దేవి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు దక్కలేదు. దీంతో ఆమె తమిళ్ లో సెటిల్ అయిపోయారు. అయితే ఆమె ఎక్కువగా వివాదాస్పద అంశాల కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా తన మూడు పెళ్ళిళ్ళకి సంబంధించిన ఆమె మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  మూడు పెళ్ళిళ్ళతో హాట్ టాపిక్

  మూడు పెళ్ళిళ్ళతో హాట్ టాపిక్

  గత ఏడాది మూడో పెళ్లి చేసుకున్న వనిత విజయకుమార్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు. వనితా విజయ్‌ కుమార్‌ గత ఏడాది పీటర్‌ పాల్‌ని వివాహం చేసుకుంది. ఆయన తన మొదటి భార్య ఎలిజబెత్‌ హెలెన్‌కి విడాకులు ఇవ్వకుండానే, అవేమీ లెక్క చేయకుండా పీటన్‌ని మ్యారేజ్‌ చేసుకుని వార్తల్లో నిలిచింది వనిత. ఆ తర్వాత ఆ వివాహం ఎన్నో రోజులు కొనసాగలేదు వివాహం జరిగిన కొన్నాళ్లకే ఆమె మూడో భర్త నుంచి కూడా విడిపోయారు.

  ఎవరికీ సరదా కాడు

  ఎవరికీ సరదా కాడు

  తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వైవాహిక జీవితం అలాగే మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాలి వచ్చిందనే అంశాలమీద ఆమె స్పందించారు. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు అని అందరూ తనను ప్రస్తావిస్తూ ఉంటారని కానీ ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం అనేది ఎవరికీ సరదా కాదని ఆమె చెప్పుకొచ్చారు. డు పెళ్లిళ్లు చేసుకున్నానన్న విషయం అందరికీ తెలుసు అన్న ఆమె తన పెళ్లిళ్లు పెటాకులు కావడానికి తల్లిదండ్రులు కూడా ఒక కారణం అని చెప్పుకొచ్చారు.

  18 ఏళ్ళకే పెళ్లి

  18 ఏళ్ళకే పెళ్లి

  అసలు తనకు ఊహ కూడా తెలియని 18 ఏళ్ళ వయసులోనే పెళ్లి చేశారని అయినా సరే అమ్మానాన్న మాటకు గౌరవం ఇచ్చి భర్తతో ఎన్నో సార్లు గొడవలు పడుతున్నా బయట పడకుండా మానసికంగా కృంగిపోయానని అని ఆమె చెప్పుకొచ్చింది. ఎన్నో ఏళ్ల మానసిక సంఘర్షణ అనంతరం ఇక ఇది కుదిరేలా లేదని చెప్పి ఆయనకు విడాకులు ఇచ్చి తాను వేరు పడ్డానని చెప్పుకొచ్చింది.. అయితే తాను విడాకులు తీసుకోవడం తన తల్లిదండ్రులకు నచ్చలేదన్న వనిత అప్పుడు పరువు పోతుందని భావించి వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి గెంటి వేశారు అని చెప్పుకొచ్చింది.

  రోడ్డు మీదకు వచ్చా

  రోడ్డు మీదకు వచ్చా

  ముగ్గురు పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేసాను అని, ఆ సమయంలో ఎలాంటి సపోర్ట్ లేకపోవడం కారణంగా నడిరోడ్డు మీద నిలిచి పోయాను అని ఆమె చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తనకు అండగా మరొకరు ఉంటే బాగుంటుందని భావించి మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లాడానని ఆమె చెప్పుకొచ్చారు. ఆయన చాలా బాగా చూసుకున్నారని, అంతా సవ్యంగా ఉంది అనుకున్న సమయంలో నాన్న వచ్చి పిల్లల పెంపకం గురించి కేసు పెట్టిన నేపథ్యంలో రెండో భర్త నుంచి విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

  Vanitha Vijayakumar, Peter Paul Marriage BREAK UP మూడో మొగుడ్ని కూడా తరిమేసిన వనితా విజయ్‌కుమార్
  అదసలు పెళ్ళే కాదు

  అదసలు పెళ్ళే కాదు

  ఇక మూడో వివాహం గురించి ఆమె పెద్దగా ప్రస్తావించలేదు. అది ఒక వివాహమని కూడా తాను భావించానని ఆమె చెప్పుకొచ్చింది. అతి కొద్ది మంది సమక్షంలో మూడో వివాహం చేసుకున్న వనిత విజయ్ కుమార్ కొద్ది రోజుల్లోనే ఆ వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎందుకు ఏమిటి అనేక కారణాలు వెల్లడించక పోయినా అసలు దాని వివాహంగానే పరిగణించనని చెప్పుకొచ్చింది. ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఈ భామ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఇప్పటివరకు తమిళంలో వీడియోలు చేస్తూ వస్తున్న ఈ భామ తొలిసారిగా రంజాన్ నేపథ్యంలో ఒక వీడియోని తెలుగు లో కూడా రిలీజ్ చేయబోతోంది.

  English summary
  Bigg boss four Tamil contestant vanitha vijaykumar is famous for her controversies. She came from a film family and acted in so many films also. Last year she married person and then separated within few days. In a recent interview she opened up about all her three marriages and the reason behind her three marriages.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X