»   » పుట్టినరోజునే ప్రారంభం...'శౌర్యం' శివ డైరక్టర్

పుట్టినరోజునే ప్రారంభం...'శౌర్యం' శివ డైరక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళ స్టార్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక క్రేజీని సొంతం చేసుకున్నారు అజిత్‌. ఇటీవలే గౌతంమేనన్‌ దర్శకత్వంలో విడుదలైన 'ఎన్నై అరిందాల్‌' 'తల'కు మంచి గుర్తింపునిచ్చింది. ఈ నేపథ్యంలో అజిత్‌ తదుపరి చిత్రం గురించి ప్రస్తుతం పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఏఆర్‌ మురుగదాస్‌, వెంకట్‌ప్రభులలో ఎవరో ఒకరు దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం సాగింది. అయితే అజిత్‌ తదుపరి సినిమాకు శివ దర్శకత్వం వహించడం ఖరారైంది. శివ గతంలో శౌర్యం, శంఖం,దరువు వంటి తెలుగులో డైరక్ట్ చేసారు. ఆ తర్వాత కార్తి హీరోగా సిరుతై(విక్రమార్కుడు రీమేక్) సినిమా డైరెక్ట్ చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వీరిద్దరి కాంబినేషన్‌లో ఇటీవల విడుదలైన 'వీరం' (వీరుడొక్కడే) చిత్రం రికార్డు సృష్టించింది. విజయ ప్రొడక్షన్స్‌ బ్యానరులో వచ్చిన ఈ చిత్రం అజిత్‌కు మరింత మాస్‌ ఫాలోయింగ్‌ను తెచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ శివ దర్శకత్వంలో నటించడానికి అజిత్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

వీరి కొత్త చిత్రం అజిత్‌ పుట్టినరోజు సందర్భంగా మే ఒకటిన ఆరంభం కానుంది. ఈ సినిమాకు 'కొలవెరి కుర్రాడు' అనిరుధ్‌ స్వరాలు సమకూర్చనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రమిది. దీపావళి కానుకగా దీనిని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే...మరో ప్రక్క అవకాశమొస్తే.. అజిత్‌తో తలపడతా అంటున్నారు 'పట్ర' విలన్‌ శ్యామ్‌పాల్‌. విలన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టమైన విషయం. కానీ తొలి చిత్రంతోనే అందర్నీ ఆకట్టుకున్న విలన్ శ్యామ్‌పాల్‌. ఇటీవల ఆయన నటించిన 'పట్ర' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇందులో శ్యామ్‌పాల్‌కు మంచి గుర్తింపు వచ్చింది. హత్య, దోపిడీ, బెదిరింపు, అత్యాచారం.. అన్ని నేరాలూ చేసేవాడిగా కనిపించి ప్రేక్షకులను భయపెట్టడం మాత్రమే కాకుండా విశ్లేషకుల మన్ననలు అందుకున్నారు.

Veeram Siva to direct Ajith's next

వాస్తవానికి తానో న్యాయవాది.. కళాశాల నిర్వాహకుడిని కూడా. కానీ హఠాత్తుగా నటుడినయ్యానని చెబుతున్నారు శ్యామ్‌. తన చిత్ర విశేషాల గురించి ఆయన మాట్లాడుతూ.. ఓసారి 'పట్ర' దర్శకుడు జయంతన్‌ లొకేషన్స్‌ చూడటం కోసం మా కళాశాలకు వచ్చారు. ఇంతలో నన్ను చూసి 'మీరు విలన్‌ పాత్రలో నటిస్తారా..?' అని అడిగారు. అస్సలు నటించాలనే ఆలోచనే లేదన్నా. ఎందుకో కాస్త బలవంతం చేసి నన్ను నటింపజేశారు.

కానీ ఇంతలా గుర్తింపు వస్తుందని వూహించ లేదు. న్యాయవాద వృత్తి.. నా ఫ్యాషన్‌. ఇదివరకు పీజు పుచ్చుకోలేదు. ఈ సినిమా విడుదలైన తర్వాత చాలా మంది నన్ను అభినందిస్తున్నారు. పలువురు దర్శకులు కూడా సంప్రదిస్తున్నారు. కానీ 'పట్ర'లాంటి గుర్తింపునిచ్చే పాత్ర కోసం వేచిచూస్తున్నా. అజిత్‌తో తలపడే అవకాశం లభిస్తే ఆ సినిమాలో తప్పకుండా నటిస్తా. నాలో విలన్‌ లక్షణాలను గుర్తించిన జయంతన్‌కు కృతజ్ఞతలని చెప్పారు.

English summary
Ajith and director Siruthai Siva seem to have decided to create the Veeram magic again. We hear that the duo will be teaming up again for a film and this will be Thala's next project after Gautham Menon's film. This project is expected to take off in the upcoming months, and will be Siva's next after Veeram in Tamil.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu