»   »  విక్రమ్ 'మల్లన్న' స్టోరీ లైన్

విక్రమ్ 'మల్లన్న' స్టోరీ లైన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ,తెలుగులో ప్రస్తుత క్రేజీ ప్రాజెక్టు మల్నన్న(కందసామి) అనేది సుస్పష్టం. ఇక ఈ సినిమాలో విక్రమ్ రకరకాల గెటప్ లలో కనపడనున్నారు. అలాగే సుశీగణేషన్ దర్శకత్వంలో కలై పులి థాను నిర్మిస్తున్న ఈ చిత్ర కథ కూడా ఢిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం విక్రమ్ పాత్ర అందరినీ ఆదుకునే రాభిన్ హుడ్ తరహాలో వెళ్తుందని తెలుస్తోంది. అలాగే కథ ప్రకారం జనం తమ కష్టాలని ,భాధలని చీటీలపై రాసి ఓ ప్రముఖ దేవాలయం వద్ద నున్న మర్రిచెట్టుకి వేళ్ళాడ తీస్తారుట.

వాటిని చదివే విక్రమ్ తన దైన శైలిలో పరిష్కరస్తూ వారి దృష్టిలో దేముడిలా ఎదుగుతాడుట. వారంతా దైవం మల్లన్నే ఈ పనులన్నీ చేసాడని భావిస్తూంటారుట.ఇక ఈ సినిమా పూర్తి హాలివుడ్ స్టైల్స్ తో నిండి ఉంటుందిట.అంతేగాక ఈ చిత్రంలో విక్రమ్ లేడీ గెటప్ లో కూడా కనపడి కనువిందు చేయనున్నాడు. ఇక శ్రియ అతన్ని మొదట అడ్డుకున్న తర్వాత అతనికి సహరిస్తూ గ్లామర్ కురిపిస్తూంటుందిట. అంటే 'అపరిచితుడు' లో ఇంటర్ నెట్ కు బదులు ఇక్కడ మర్రిచెట్టు వస్తుందన్నమాట. ఇక ఈ సినిమా గురించి విక్రమ్ చాలా గొప్పగా చెప్తున్నాడు. ఆయన చెప్పే దాని ప్రకారం హాలీవుడ్ తరహాలో ఇండియన్ జేమ్స్ బాండ్ లా మల్లన్న కనపడతాడుట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X