»   » నాన్న ముందే రొమాన్స్ చేయటానికి కాస్త ఇబ్బంది పడ్డాను :ఐశ్వర్యా అర్జున్

నాన్న ముందే రొమాన్స్ చేయటానికి కాస్త ఇబ్బంది పడ్డాను :ఐశ్వర్యా అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కూతురు ఐశ్వర్య 'పట్టత్తుయానై' చిత్రం ద్వారా హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేసింది. విశాల్‌ హీరోగా నటించిన ఆ సినిమా పరాజయం పాలవడంతో ఐశ్వర్యకు రావాల్సినంత పేరు రాలేదు. ఒకనాటి అగ్రకథానాయకుల కూతుర్లు కథానాయికలుగా రంగంలోకి దిగుతున్నారు. కొంతమంది సక్సెస్ లను అందుకుంటూ వుంటే, మరికొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటివారి జాబితాలో అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా కనిపిస్తోంది. దీంతో స్వయంగా అర్జున్‌ దర్శకుడి అవతారమెత్తి తన కూతురు హీరోయిన్‌గా తమిళ, కన్నడ భాషల్లో ఓ సినిమా నిర్మిస్తున్నాడు.

'కాథలిన్‌ పోన్‌ వీధియిల్‌' పేరుతో చందన్ .. ఐశ్వర్య జంటగా నటించే ఈ సినిమా, ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కొత్త కాన్సెప్ట్ తో రూపొందే ఈ కథ, యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో అర్జున్ ఉన్నారు. ఇది పూర్తిగా రొమాంటిక్‌ లవ్‌స్టోరి. ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య ఘాటైన రొమాంటిక్‌ సన్నివేశాలుంటాయట. వీటి గురించి ఐశ్వర్య మాట్లాడుతూ.. 'ఇది పూర్తిగా రొమాంటిక్‌ లవ్‌స్టోరి. హీరోతో కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాలు చేయాల్సి వచ్చింది. నాన్న ముందు అలాంటి సన్నివేశాలు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా. ఎలా చేయాలో అర్థమయ్యేది కాదు. అయితే అది షూటింగ్‌ స్పాట్‌ అని, నాన్న ఓ దర్శకుడని గుర్తించాక ఆ భావన మాయమైందని తెలిపింది. తొలి రెండు రోజులూ ఇబ్బంది పడినా, తర్వాత ఆ సన్నివేశాల్లో సహజంగానే నటించాన'ని ఐశ్వర్య తెలిపింది.

"Working with dad is fun" - Aishwarya Arjun

ఈ చిత్రంలో ఓ పాటకు హాలీవుడ్ కవల నృత్యదర్శకురాళ్లు పూనంషా, ప్రియాంకాషా కొరియోగ్రఫి అందించడం విశేషం. రంతాజోగి, తాళ్‌డాన్స్ తో పాటు భరతనాట్య ంలోనూ ప్రావీణ్యం పొందిన పూనం షా, ప్రియాంకాషాలను ఈ చిత్రానికి నృత్యదర్శకత్వం వహించాలన్న ఐశ్వర్య అర్జున్ కోరిక మేరకు వాళ్లను ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేసినట్లు వెల్లడించారు. ఇందులో ప్రఖ్యాత దర్శకుడు కే.విశ్వనాథ్, సుహాసిని, మొట్టై రాజేంద్రన్, మనోబాలా, సతీష్, బ్లాక్‌పాండి, బోండామణి ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. జాస్సీగిఫ్ట్ సంగీతాన్ని అందిస్తున్నారు.

English summary
“I am so happy to act in his film, but at the same time, I feel a little scared to act in front of my dad. It will be a new experience for me,” says Aishwarya Arjun. “The best part though is that I know how my dad works" says Aishwarya Arjun
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu