»   » టీవీ నటి బెడ్ రూంలో రాత్రిపూట మంటలు, గాయాలు,తాగి ఉందని అనుమానం

టీవీ నటి బెడ్ రూంలో రాత్రిపూట మంటలు, గాయాలు,తాగి ఉందని అనుమానం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కొన్ని విషయాల్లో ఎన్ని సార్లు చెప్పుకున్నా, విన్నా జాగ్రత్తలు అవసరం. నిర్లక్ష్యం ఒక్కోసారి కొంప ముంచే ప్రమాదాలు తీసుకువస్తుంది. ఇప్పుడు అలాంటి సంఘటనే టీవి నటి అంకితా లోఖాండే బెడ్ రూంలో చోటు చేసుకుంది. ఆమె వెలిగించిన కొవ్విత్తి తో ఆమె బెడ్ రూంలో మంటలు వచ్చాయి. ఆమె చేతులు, మెడ పై కాలింది. అయితే అదృష్టవశాత్తు ఎక్కువ ఎక్కువ గాయాలు అవ్వలేదు. ఆమె బయిటపడింది.

ఆమె మీడియాతో మాట్లాడుతూ..." నేను ఆరోమా కొవ్విత్తిని వెలిగించాను బెడ్ రూంలో వాసన కోసం, వెలుగు కోసం. అయితే ఎలా అంటుంకుందో ఆ గది కర్టెన్ అంటుంది. నేను గమనించలేదు. కాస్సేపటికి చూసి ఎలర్టయ్యాను. అయితే అప్పటికే కొంత మేర మంటలు రేగాయి. నేను వాటిని ఆర్పాను. ఈ ప్రాసెస్ లో నా మెడ, నా చేతులు కాలిపోయాయి. టైం బాగుంది. దేముడు నా అందు ఉన్నాడు.. నా ముఖానికి ఏం కాలేదు.

ఇంకా అదృష్టం ఏమిటంటే నా బాల్కనీ దాకా మంటలు వచ్చి ఉంటే ప్రమాదం ఇంకా పెరిగి ఉండేది. అక్కడ నాలుగు గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. నేను ఊహించలేకపోతున్నాను..ఎంత ప్రమాదం జరిగి ఉండేదనేది. నేను చేసుకున్న పుణ్యమే నన్ను కాపాడినట్లుంది. లేకపోతే మేజర్ గా కాలిపోయి..నేను ఇలా మీకు కనపడేదాన్నికాదేమనో ," అంటూ చెప్పుకొచ్చింది.

స్లైడ్ షోలో మరిన్నిపర్శనల్ లైప్ గురించి ఆశ్చర్యపరిచే నిజాలు

బ్రేకప్ మ్యాటర్

బ్రేకప్ మ్యాటర్

ఇటీవలే బ్రేకప్ చెప్పిన బాలీవుడ్ జంట సుశాంత్ సింగ్ రాజపుత్, అంకితా లోఖాండే. విడిపోయిన ఈ జోడీ గురించి మరిన్ని విషయాలు బయటకొస్తున్నాయి. బ్రేకప్ విషయాన్ని మొదటపెట్టింది సుశాంత్. అంతటితో ఆగకుండా అంకితాతో విడిపోవడానికి గల కారణాలను ఒక్కొక్కటిగా లీక్ చేస్తున్నాడు. అవన్నీ ఇప్పుడు సెన్సేషన్ గా మారుతున్నాయి.

ప్రెవేట్ పార్టీలో తాగుడు గోల

ప్రెవేట్ పార్టీలో తాగుడు గోల

ఓ ప్రైవేట్ పార్టీలో టీవీ నటి అంకితా ఫుటుగా తాగి లవర్ సుశాంత్ పై నోరు పారేసుకుందట. ఇష్టం వచ్చినట్లు సుశాంత్ ను తిట్టిందట. ఈ విషయాలు అక్కడి మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందరూ ఆమె తాగుడు గురించి మాట్లాడుతున్నారు. నేషనల్ మీడియానే కాదు..రీజనల్ మీడియా సైతం ఈ విషయమై ఓ రేంజిలో కవరేజ్ ఇచ్చింది.

నేనొక్కిడినే హీరోయిన్ కారణం

నేనొక్కిడినే హీరోయిన్ కారణం

సుశాంత్, అంకితల బ్రేకప్ లో హీరోయిన్ కృతీసనన్(1 నేనొక్కిడనే ) ప్రమేయం ఉందని వదంతులు వినిపించాయి. అంకిత కూడా ఈ విషయంలోనే సుశాంత్ తో తరచూ గొడవ పడేదని బాలీవుడ్ టాక్. అయితే కృతి సనన్ ఈ విషయమై ఎక్కడా మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆమె గురించి కూడా బాలీవుడ్ లో రకరకాలు చెప్పుకున్నారు. అయితేనేం డోంట్ కేరు అన్నట్లు సుశాంత్ తో తిరిగేది.

తాగింది, ఆడవాళ్లతో తిరిగా

తాగింది, ఆడవాళ్లతో తిరిగా

'ఆమె బాగా డ్రింక్ చేస్తేనేమి, నేను ఆడవాళ్లతో క్లోజ్ గా ఉంటేనేం' ఏది ఏమైనా మా బ్రేకప్ జరిగిపోయిందంటూ కొన్ని రోజుల కిందట సుశాంత్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ అంతటా సంచలనం గా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంత ఓపెన్ గా ఇలా మాట్లాడటం బాలీవుడ్ ని విస్తుపోయాలే చేసింది. అయితే సుశాంత్ మాత్రం ప్రతీదీ దాచుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు.

ఇద్దరికి ఇద్దరే..

ఇద్దరికి ఇద్దరే..

దీన్ని బట్టి అంకితా తాగుడుకు హద్దు లేదని, ఆ తర్వాత ఆమె కంట్రోల్ లో ఉందడని తేలిపోయింది. కరెక్టుగా ఆ సమయంలో సుశాంత్ మిగతా సెలబ్రిటీలతో చాలా చనువుగా మెలగడం కూడా అంకితాకు కోపం తెప్పించిందని కథనాలు వచ్చాయి. తనతో క్లోజ్ గా ఉన్నందుకు తనపై తనకే విరక్తిగా ఉందని, ఇంకా ఏవో మాటలన్నదని సుశాంత్ ట్వీట్ చూస్తే అర్థమవుతోంది.

తిట్టుకోవటం మొదలెట్టారు

తిట్టుకోవటం మొదలెట్టారు

తనకు ప్రేమించడం ఎలాగన్నది తెలుసునంటూ అంకితా కూడా ఈ మధ్య ట్వీట్ చేసింది. బ్రేకప్ అయిన తర్వాత ఇప్పటివరకూ వీరిద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ, విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

సుశాంత్ ఇప్పుడు హాట్ టాపిక్

సుశాంత్ ఇప్పుడు హాట్ టాపిక్

సుశాంత్‌సింగ్‌ రాజపుట్‌... ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్న పేరు. కారణాలు రెండు. మొదటిది భారతీయ క్రికెట్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోని బయోపిక్‌లో ప్రధాన పాత్ర ధరిస్తూ వుండడం కాగా, రెండవది అతని ఫియాన్సీ అంకితా లొఖాండే ప్రేమకు తిలోదకాలు ఇవ్వడం. ఈ రెండు కారణాలతో అతను నిత్యం మీడియా వార్తల్లో మునిగితేలుతున్నాడు.

అదే మొదలు ప్రేమకు పునాది

అదే మొదలు ప్రేమకు పునాది

అభిషేక్‌ కపూర్‌ నిర్మించిన ''కాయ్‌ పో చే'' (2013) సినిమాలో ముగ్గురిలో ఒక హీరోగా నటించిన సుశాంత్‌సింగ్‌, అంకిత లోఖాండే ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలిసి బాంద్రాలో వుంటున్నారు. తర్వాత ఏమైందో ఏమోగానీ, ఈ మధ్య జరిగిన హోలీ వేడుకలకు సుశాంత్‌ ఒక్కడే హాజరయ్యాడు.

ఆరా తీసింది....అల్లరి చేసింది

ఆరా తీసింది....అల్లరి చేసింది

మీడియా ఈ విషయానికి ఓ రేంజిలో కవరేజ్ ఇచ్చింది. అంకిత నివాసం నుంచి బయటకి వచ్చేసిన సుశాంత్‌ ఓ హోటల్‌లో ఉంటున్నాడని తేలింది. అంతే... మీడియా కోడైపోయింది. అయితే ''ధోని'' బయోపిక్‌ కోసం ఇదేదో కొత్త ప్రచారమేమో... అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇలాంటివి బాలీవుడ్ లో కామన్ కాబట్టి అందరూ అనుమాన పడ్డారు.

కొట్టకుండా ఉంటే బాగుండేది

కొట్టకుండా ఉంటే బాగుండేది

అయితే అంకిత అంతక్రితమే సుశాంత్‌కి రెండుసార్లు చెంప చెళ్ళుమనిపించింది. ఒకసారి యాష్‌ చోప్రా స్టూడియో బయట, మరోసారి ఒక పబ్‌లో. ఇక వీరి ప్రేమాయణం తుమ్మితే వూడే ముక్కులా వుందని వేరే చెప్పాలా అంటున్నారు బాలీవుడ్ జనం. ఈ విధంగా ఇద్దరూ ఒకరిపై మరొకరు మీడియా చూస్తుండగా దెబ్బలాడుకోవటం రకరకాల అనుమానాలకు తావిస్తోంది.

మేము కలవలేదని చెప్పింది

మేము కలవలేదని చెప్పింది

మరోవైపు అంకిత రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు, సుశాంత్‌కు మధ్య ఇంకా పరిష్కారమేదీ కాలేదని చెప్పింది. తను సుశాంత్ తో ఉండటం ఇష్టం లేదని చెప్పింది. అతను అమ్మాయిల పిచ్చోడంటూ విమర్శలు చేసింది. సుశాంత్ సైతం అదే రీతిలో ఆమె పచ్చితాగుబోతంటూ విమర్శలు చేస్తూనే ఉన్నాడు. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

కామన్ అంటున్నారు

కామన్ అంటున్నారు

అంకిత, సుషాంత్‌లు ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో కూడా హాటెస్ట్ కపుల్స్. వారి పరిచయం 'పవిత్ర రిష్తా'తో ప్రారంభమైంది. ఆ తర్వాత సుషాంత్ ఓ మూవీ కోసం ఆ సీరియల్‌ను వదిలేశారు. అంకిత మాత్రం కంటిన్యూ చేస్తోంది. కాబట్టి మళ్లీ వీళ్లిద్దరూ కలిసినా ఆశ్చర్యమయితే లేదు. వింత అంతకన్నా లేనట్లే. ఇవన్నీ ఈ సెలబ్రెటీ జీవితాల్లో కామనే కదా

English summary
TV actress Ankita Lokhande has suffered burns on her hands and neck after her bedroom caught fire from a candle she’d lit. The actress, however, has escaped serious injuries.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu