Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అందరూ ఓ వైపు.. దేవీ నాగవల్లి మరో వైపు.. ఫినాలె సెలెబ్రేషన్స్ అందుకే దూరం!!
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ ప్రారంభంలో దేవీ నాగవల్లిపై ఓ రకమైన అభిప్రాయం ఉండేది. ఆమెను ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ చేసేద్దామా? అని ప్రేక్షకులు కాచ్చుకుని కూర్చున్నారు. అలా ఆమె మూడో వారంలో నామినేషన్‌లో చిక్కింది. అయితే ఆమె ఆటను, ప్రవర్తను, ఉండే విధానాన్ని చూసిన ఎవ్వరైనా సరే ఎలిమినేట్ అవుతుందని అనుకోరు. కానీ అనూహ్యంగా దేవీ నాగవల్లి మూడో వారంలోనే ఎలిమినేట్ అయింది. అయితే దేవీ నాగవల్లి ఎలిమినేషన్ వెనకాల ఎన్నో మంతనాలు జరిగినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

మొదటగా మెహబూబ్..
మూడో వారంలోనే మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని లీకులు వచ్చాయి. కానీ చివరకు దేవీ నాగవల్లి బయటకు వచ్చింది. నిజంగా ఓట్లు తక్కువగా వచ్చి ఆమె ఎలిమినేట్ అయిందా? లేదా బిగ్ బాస్ టీం కావాలనే ఎలిమినేట్ చేసిందా? అన్నది ఇప్పటికీ మిస్టరీనే. అలా దేవీ నాగవల్లి బయటకు వచ్చాక తనకు ఓట్లు బాగానే పడ్డాయని తెలుసుకుంది.

అక్కడే హర్ట్..
బిగ్ బాస్ ఇంట్లో నేను ఉంటే గేమ్ డిస్టర్బ్ అవుతోందని, అందరూ నన్ను చూసి ప్రభావితం అవుతున్నారని వారు నన్ను ఎలిమినేట్ చేసి ఉంటారని దేవీ నాగవల్లి చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానుల వల్లే నేను ఎలిమినేట్ అయ్యానని భావించను.. ఎందుకంటే ఇప్పుడు మళ్లీ బ్రింగ్ బ్యాక్ దేవీ అంటూ ట్రెండ్ చేస్తోంది కూడా వాళ్లే కదా అంటూ దేవీ నాగవల్లి చెప్పుకొచ్చింది. అలా తనను కావాలనే బయటకు పంపించారేమోనని దేవీ నాగవల్లి హర్ట్ అయినట్టుంది.

అందుకే దూరం..
అలా బిగ్ బాస్ తనను మోసం చేశారని దేవీ నాగవల్లి భావించడంతోనే ఫినాలె వేడుకలకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది. రీ యూనియన్‌లో భాగంగా ఇంట్లోకి కూడా వెళ్లలేదు. సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్, దేవీ నాగవల్లి ఇంట్లోకి వెళ్లలేదు. కానీ అమ్మ రాజశేఖర్, సూర్యకిరణ్ ఫినాలే స్టేజ్ మీద సందడి చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ దేవీ నాగవల్లి కనిపించలేదు.

డోంట్ కేర్..
బిగ్ బాస్ టీం దేవీ నాగవల్లి ఆహ్వానించినా కూడా వెళ్లలేదట. ఆ ఆహ్వానాన్ని ఖాతరు కూడా చేయలేదని తెలుస్తోంది. అయితే ఆమె అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకు ఫినాలే ఎపిసోడ్‌కు రాలేదంటూ కామెంట్లలో పెడుతున్నారు.

విన్నర్, రన్నర్..
మొదటిసారిగా విన్నర్ గురించి కాకుండా రన్నర్ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరగుతున్నాయి. విన్నర్ అభిజిత్ అంటూ అందరూ ఆ విషయాన్ని గట్టిగా నమ్మేస్తున్నారు. అభిజిత్ భారీ ఓట్లు కొల్లగొట్టేశాడని తెలుస్తోంది. ఇప్పటికే అరియానా, హారికలు రేసు నుంచి తప్పుకున్నారు. సోహెల్, అఖిల్‌లో ఎవరు రన్నర్ అవుతారన్నది చూడాలి.