Just In
- 1 hr ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 1 hr ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 1 hr ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 2 hrs ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- Sports
స్మిత్‌ను ఎందుకు వదిలేశారు?.. వార్నర్ కన్నా స్టీవ్ పెద్ద నేరస్థుడు: ఇయాన్ చాపెల్
- Automobiles
ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్
- News
సుప్రీంకోర్టులో ఏపీ పంచాయతీ- సర్కారు అప్పీలు-ఎస్ఈసీ కేవియట్- తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bigg boss 14th week eliminations: చెమటలు పట్టించిన నాగార్జున.. ప్రింటింగ్ తో మరో ట్విస్ట్
బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి 14 వారంలో ఒక భారం తీర్చుకోనుందనే ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అసలు ఇన్ని రోజులు ఉండాల్సిన అవసరం లేని కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ నిర్వహకులు ఎలా కొనసాగిస్తున్నారనే విమర్శలు కూడా చాలానే వచ్చాయి. ఇక ఈ సారైనా అనుకున్నట్లు ఎలిమినేషన్ లో న్యాయం జరుగుతుందా లేక చివరి నిమిషంలో ట్విస్ట్ ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ యొక్క ప్రోమోను విడుదల చేసి మరింత హైప్ క్రియేట్ చేశారు.

ఆమె సేవ్ అవ్వడం.. పెద్ద మిస్టరీ
బిగ్ బాస్ 4లో అతి తక్కువ ఓట్లు సాధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో మోనాల్ కూడా ఉంటుందని సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా రకాల ట్రోల్స్ వచ్చాయి. అలాంటి కంటెస్టెంట్ ను ఇప్పటివరకు ఎలా కంటిన్యూ చేస్తున్నారనేది పెద్ద మిస్టరీ. బిగ్ బాస్ నిర్వహకులు రేటింగ్ కోసం ఏదైనా గ్యాబ్లింగ్ చేశారో లేక ఆమె అదృష్టమో తెలియదు గాని ప్రతి వారం చివరి క్షణంలో సేవ్ అవుతూ వచ్చింది.

అందరి చూపు ఆమె వైపే..
ఇక 14వ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే.. హారిక వెళ్లిపోవచ్చని మొదట్లో ప్రచారాలు గట్టిగానే వచ్చాయి. కానీ అభిజిత్ తరువాత ఆమెకు ఎక్కువగా ఓటింగ్స్ వచ్చాయనే టాక్ నిన్ననే వైరల్ అవ్వడంతో అందరి చూపు మోనాల్ వైపు మళ్ళింది. ఈ సారి ఎలిమినేట్ అయ్యేది అమేనే అంటూ కథనాలు చాలానే వస్తున్నాయి. అరియానా కూడా డేంజర్ జోన్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.

చెమటలు పట్టించిన నాగార్జున
ఇక ప్రోమోలో నాగార్జున ప్రింటింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎలిమినేషన్ లో క్లారిటీ ఇవ్వబోతున్నారు. మోనాల్, అరియానాను నిలబెట్టి.. ఫైనలిస్ట్ కు సంబంధించిన ఫొటో అందులో వస్తుందని రానివారు ఎలిమినేట్ అవుతారని నాగార్జున ఉత్కంఠను రేపుతూ చెమటలు పట్టించినట్లు తెలుస్తోంది. ఇక ఫొటో అరియానాదేనని చాలా ఈజీగా అర్ధమయ్యింది. ప్రోమోతోనే నేటి ఎపిసోడ్ పై అంచనాల డోస్ ను మరింత పెంచేశారు.

గతంలో విమర్శలు చాలానే వచ్చాయి
మోనాల్ వెళ్లిపోవడం కాయమని దాదాపు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ప్రతి ఎలిమినేషన్ లో డేంజర్ లో ఉంటున్న ఏకైక కంటెస్టెంట్ మోనాల్. గత వారమే ఆమె వెళ్లిపోతుందని అంతా భావించారు. కానీ అవినాష్ ను తప్పించి మోనాల్ ను సేవ్ చేయడంతో విమర్శలు చాలానే వచ్చాయి. ఇక ఇప్పుడు ఆమె వెళ్లిపోతే బిగ్ బాస్ హౌజ్ లో రొమాన్స్ డోస్ తగ్గినట్లే. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.