Just In
- 10 min ago
ఇంతకంటే మంచి సినిమా ఉంటుందా.. ‘మాస్టర్’పై కుష్బూ కామెంట్స్
- 12 min ago
బాలీవుడ్‌లోకి ‘క్రాక్’: రవితేజ పాత్రలో రియల్ హీరో.. అదిరిపోయే ప్లాన్ రెడీ
- 30 min ago
Vakeel Saab Teaser: ఆరో స్థానంతో సరిపెట్టుకున్న పవన్.. అందులో మాత్రం రెండో ప్లేస్
- 41 min ago
మొన్న అక్కడ.. నేడు ఇక్కడ.. ‘ఊకో కాక’ బ్రాండ్‌తో రాహుల్ రచ్చ
Don't Miss!
- Automobiles
పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?
- News
ఈ రోజు తాను కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవటంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటెల రాజేందర్
- Sports
వర్షం కారణంగా సాగని మూడో సెషన్.. ముగిసిన రెండోరోజు ఆట!! భారత్ స్కోర్ 62/2!
- Finance
మొబైల్ నెంబర్‌కు కాల్ చేయాలంటే సున్నాను చేర్చండి, గుర్తు చేస్తున్న టెల్కోలు
- Lifestyle
తరచూ మూత్ర విసర్జన చేయాలనిపిస్తోందా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవర్ స్టార్ సినిమాలో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు అవకాశం.. ఆమె దశ తిరిగినట్లే?
బిగ్ బాస్ తెలుగు 4 ద్వారా ఈ సారి కంటెస్టెంట్స్ మంచి క్రేజ్ అందుకున్నారనే చెప్పాలి. కేవలం టాప్ లిస్ట్ లోకి వచ్చినవారే కాకుండా బిగ్ బాస్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన మరికొందరు కూడా ఎంతగానో క్రేజ్ అందుకున్నారు. ఇక అలాంటి వారికి సినిమాల్లో ఛాన్సులు కూడా బాగానే వస్తున్నాయి. ముఖ్యంగా ఫైనల్స్ లో మెగాస్టార్ ఎలాంటి వరాలు ఇచ్చారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

మెగాస్టార్ ఇచ్చిన మాటతో..
మెగాస్టార్ చిరంజీవి, సోహెల్ చేయబోయే సినిమాలో గెస్ట్ రోల్ చేస్తానని కూడా వాగ్దానం చేశాడు. ఆ మాటతో సోహెల్ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజులకే సోహెల్ వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతను చేస్తున్న సినిమాలపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

దివి..దశ తిరిగింది
బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ గా దివి అనుకోని విదంగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. గొడవలు వలన పెద్దగా పాపులర్ అవ్వని ఆమె బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లగానే ఆఫర్స్ బాగానే అందుకుందట. అయితే ఫైనల్ రోజు మెగాస్టార్ ఆమెకు ఆఫర్ ఇవ్వడం కూడా మంచి క్రేజ్ ను అందించింది.

పవన్ కళ్యాణ్ సినిమాలో..
ఇక మరో మెగాహీరో సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒకరు నటించబోతున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవల వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలతో బిజీ కానున్నాడు. అయితే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కు ఆ సినిమాల్లో ఛాన్స్ దక్కే అవకాశం ఉందట.

ఆ ఛాన్స్ కొట్టేసింది ఎవరంటే..
ఇక ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు.. దివి. ఆమె ఇప్పటికే మెగాస్టార్ వేదళం రీమేక్ లో ఒక ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని దివికి మాత్రం ఆఫర్స్ బాగానే వస్తున్నాయట. మరి ఆ ఆఫర్స్ తో అమ్మడు ఎలాంటి గుర్తింపును అందుకుంటుందో చూడాలి.