Don't Miss!
- News
girlfriend: సీక్రేట్ గా పెళ్లి, కొండ మీద రొమాన్స్, పోలీసు అధికారి కొడుకు ఏం చేశాడంటే, ఇంట్లోనే కిల్లర్!
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
బిగ్‌బాస్2 ఫైనల్ అప్‌డేట్: విజేత కౌశల్!.. రికార్డుస్థాయిలో ఓట్లు.. ఆ ముగ్గురు ఇంటికి..
బిగ్‌బాస్ తెలుగు 2 రియాలిటీ షో ఆదివారం జరిగే ఫైనల్‌తో ముగియనున్నది. ఫైనల్ పోరులో కౌశల్, గీతా మాధురి, దీప్తి, తనీష్, సామ్రాట్ నిలిచారు. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇతర భాషల్లో కూడా లేని విధంగా బిగ్‌బాస్ విజేత ఎంపిక కోసం రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఓట్లు వేసినట్టు తెలుస్తున్నది. బిగ్‌బాస్ 2 వచ్చిన స్పందన చూసి నిర్వాహకులే షాక్ తిన్నట్టు సమాచారం. ఆదివారం జరిగే ఫైనల్ ఎపిసోడ్ కోసం భారీగా ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే..

టైటిల్ రేసులో కౌశల్
తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ ఫైనల్ కోసం ఆదివారం ఉదయం 4 గంటల వరకు షూటింగ్ జరిగింది. ఐదుగురిలో ముగ్గురిని పోటీ నుంచి ఎలిమినేట్ చేశారు. చివరి రౌండ్‌కు ఇద్దరు మిగిలారు. వారిలో కౌశల్ ఒకరు అని స్పష్టంగా తెలిసింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారిలో సామ్రాట్, తనీష్ ఉన్నట్టు సమాచారం.

విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా
బిగ్‌బాస్ ఫినాలే కోసం ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్‌ను ఆహ్వానించారు. విజేతను విక్టరీ వెంకటేష్ ప్రకటిస్తారు. దాంతో బిగ్‌బాస్ తెలుగు 2 రియాలిటీ షో ముగుస్తుంది. వెంకటేష్ రాకతో బిగ్‌బాస్ వేదిక సందడి సందడిగా మారిందని సమాచారం.

వేదిక వద్దకు సెలబ్రిటీల ఫ్యామిలీ
బిగ్‌బాస్ టైటిల్ కోసం పోటీ పడిన ఐదుగురు సభ్యుల కుటుంబం వేదిక వద్దకు చేరుకొన్నది. సామ్రాట్ తల్లి, కౌశల్ కుటుంబం వేదిక వద్దకు చేరుకొన్నది. అధికారికంగా బిగ్‌బాస్ విజేతను సాయంత్రం 4 గంటలకు ప్రకటించి షూట్ మొదలుపెడుతారని సమాచారం.

ఫైనల్ కోసం భారీగా ఓటింగ్
బిగ్‌బాస్ ఫైనల్ కోసం జరిగిన ఓటింగ్ ముగిసే సమయానికి ఆన్ లైన్ ఓటింగ్, మిస్డ్ కాల్ ఓటింగ్‌తో కలిపి దాదాపు 50 కోట్ల మేరకుపైగానే ఓట్లు వచ్చినట్టు సమాచారం. ఇతర భాషలతో పోల్చుకొంటే ఈ మొత్తం ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.

అత్యధికంగా కౌశల్‌కు ఓట్లు
ఇక పోలైన ఓట్లలో అత్యధిక ఓట్లు కౌశల్‌కు వచ్చినట్టు తెలుస్తున్నది. కౌశల్‌కు సుమారు 65 నుంచి 70 శాతం ఓట్లు వచ్చినట్టు అంతర్గత సమాచారం. ఇక రెండో స్థానంలో గీతా మాధురి నిలిచినట్టు తెలుస్తున్నది.

కౌశల్‌కు 39 కోట్ల ఓట్లు
బిగ్‌బాస్ ఫైనల్ కోసం జరిగిన ఓటింగ్‌లో కౌశల్‌కు సుమారు 39 కోట్లకు పైగా ఓట్లు వచ్చినట్టు తెలిసింది. దాంతో కౌశల్ బిగ్‌బాస్ విజేతగా నిలిచినట్టు తెలిసింది. ఈ ఓట్ల సంఖ్య నిజమైతే.. దేశంలోనే అత్యధికంగా ఓట్లు సంపాదించుకొన్న బిగ్‌బాస్ విజేతగా కౌశల్ ఓ రికార్డున సొంతం చేసుకోవడం ఖాయం.

కౌశల్ ఆర్మీ అండతో
బిగ్‌బాస్ ఇంటిలో ఏకాకిగా మారిన కౌశల్‌కు కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో అండగా నిలిచింది. కౌశల్ ఆర్మీలో ఔత్సాహిక నెటిజన్లు చేరిపోయి.. కౌశల్‌కు బయట నుంచి మద్దతు ఇచ్చారు.

బిగ్‌బాస్ ప్రశంస
బిగ్‌బాస్ ఇంటిలో సభ్యుల నుంచి అనేక ఒత్తిడి, ఎదురుదాడులు ఎదురైనా కౌశల్ నిబ్బరం కోల్పోలేదని స్వయంగా బిగ్‌బాస్ ప్రశంసించడం తెలిసిందే. తన వ్యూహానికి కట్టుబడి తన లక్ష్యాన్ని చేరుకొన్నారనే మాట సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నది.

వేదికపైకి నాని ఎంట్రీ అదుర్స్
ఆదివారం జరిగే బిగ్‌బాస్ ఫినాలే కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. నాని ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా మారింది. కార్యక్రమంలో అనేక వినోద కార్యక్రమాలు ఆకర్షణగా మారినట్టు తెలుస్తున్నది. ఎలిమినేట్ ఇంటి సభ్యులు వేదికపైన కనిపించడం మరో స్పెషల్ ఎట్రాక్షన్ అని చెబుతున్నారు.