For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్ 3 తెలుగు ఫినాలె : విజేతగా నిలిచిన రాహుల్.. ట్రోఫీ అందజేసిన చిరు

  |
  Bigg Boss Telugu 3 : Rahul Sipligunj Rahul Sipligunj Wins The Trophy || Filmibeat Telugu

  జూలై 21న మొదలైన బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3న ముగిసింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచాయి. స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరించారు.

  అతిథుల చేతుల మీదుగా ఎలిమినేషన్..

  అతిథుల చేతుల మీదుగా ఎలిమినేషన్..

  ఆటలు, పాటలు, అతిథులు ఇలా ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన నాగ్.. స్టెప్ బై స్టెప్ ఎలిమినేషన్ ప్రక్రియలను చేపట్టాడు. రాశీ ఖన్నా, మారుతి ఎంట్రీ ఇచ్చి అలీ రెజాను ఎలిమినేట్ చేయగా.. క్యాథరిన్, శ్రీకాంత్ వచ్చి వరుణ్ సందేశ్‌ను ఎలిమినేట్ చేసేశారు. ప్రత్యేక అతిథుల మీదుగా ఈ ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించిన నాగ్.. ఎలిమినేషన్ ప్రక్రియకు కాసేపు విరామం ఇచ్చాడు.

  టాప్3గా బాబా భాస్కర్

  టాప్3గా బాబా భాస్కర్

  అనంతరం బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, సీరియల్ యాక్టర్స్‌ కలిసి చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ ఆకట్టుకుంది. వితికా- అగ్ని సాక్షి ఫేమ్ అర్జున్, పునర్నవి- సిరిసిరి మువ్వలు ఫేమ్ అశ్విన్.. రవికృష్ణ-నవ్య స్వామి..శిల్పా చక్రవర్తి-కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ డ్యాన్సులు అదిరిపోయాయి. మూడో ఎలిమినేషన్ కోసం అంజలి గెస్ట్‌గా వచ్చేసింది. పది లక్షలు, ఇరవై లక్షలు, ఇరవైదు లక్షలను హౌస్‌మేట్స్ అందరూ కాదనుకున్నారు. మూడో ఎలిమినేషన్‌లో భాగంగా బాబా భాస్కర్ ఎలిమినేట్ అయినట్లు అంజలి ప్రకటించేసింది.

  ఇస్మార్ట్ బ్యూటీ చిందులు..

  ఇస్మార్ట్ బ్యూటీ చిందులు..

  మూడు ఎలిమినేషన్ల అనంతరం ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ అందర్నీ ఎంటర్టైన్ చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని జిలేలమ్మ జిట్టా అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేసి స్టేజ్‌ దద్దరిల్లేట్టు చేసింది. జిగేల్ రాణి అంటూ అందాల నిధితో ఫినాలే వేదికను ఊపేసింది. పక్కా లోకల్‌తో ఫైనల్ టచ్ అన్నట్టుగా నిధి డ్యాన్సులతో ఆకట్టుకుంది.

  నాగ్ ఆఫర్‌ను తిరస్కరించిన ఇద్దరు

  నాగ్ ఆఫర్‌ను తిరస్కరించిన ఇద్దరు

  టాస్ 2లో మిగిలిన ఇద్దరిని పలకరించేందుకు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ్. వారితో కాసేపు సరదాగా మాట్లాడాడు. వారి జర్నీలకు సంబంధించిన వీడియోలను ప్లే చేసి చూపించాడు. వంద రోజులకు పైగా కష్టపడి టాప్2లోకి వచ్చిన రాహుల్, శ్రీముఖిలకు చివరగా నాగ్ ఓ ఆఫర్‌ను ఇచ్చాడు. ప్రైజ్ మనీ యాభై లక్షలని, ఇద్దరికీ చేరో రూ.25లక్షలు ఇస్తానని డీల్ మాట్లాడాడు. కానీ దాన్ని వారిద్దరూ తిరస్కించేశారు.

  మెగాస్టార్ ఎంట్రీ..

  మెగాస్టార్ ఎంట్రీ..

  వంద రోజులకు పైగా ప్రయాణం.. హోరాహోరీ పోరులో పదిహేడు మంది కంటెస్టెంట్లు.. చివరకు గెలిచేది ఒక్కరే. ఎంతో కష్టపడి టాప్5కు చేరుకున్న కంటెస్టెంట్లలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ టైటిల్ విజేత ఎవరన్న ఉత్కంఠకు తెరదించుతూ.. విన్నర్‌ను ప్రకటించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చాడు. టాప్5లోంచి అలీ, వరుణ్, బాబా ఎలిమినేట్ కాగా.. మిగిలిన ఇద్దరి భవిష్యత్తును తేల్చేందుకు చిరు వచ్చేశాడు.

  పంచ్‌లతో అదరగొట్టిన చిరు..

  పంచ్‌లతో అదరగొట్టిన చిరు..

  ఫినాలె ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిరు.. విజేతను ప్రకటించేందుకు బిగ్‌బాస్ స్టేజ్ మీదకు వచ్చేశారు. రాగానే నాగ్‌ను ఇరకాటంలోకి నెట్టాడు. ఉన్న ఇద్దరికలో ఎవరు గెలుస్తారో చెప్పమని నాగ్‌ను ప్రశ్నించాడు. కోపం కూకట్ పల్లిలో ఉండే నాగార్జున నార్కట్ పల్లిలో ఉంటాడంటూ నాగ్‌పై అదరిపోయే పంచ్ వేశాడు. అలీపై నాగ్ ఫైర్ అవుతూ.. ఖాన్ కే నీచే అంటూ చెప్పిన డైలాగ్‌ను చిరు తన స్టైల్లో చెప్పేశాడు. అనంతరం ప్రతీ ఒక్క కంటెస్టెంట్‌ను పేరు పేరున పలకరించాడు. అందరితో సరదాగా మాట్లాడుతూ.. కౌంటర్లు వేశాడు.

  రాహుల్‌ను విన్నర్‌గా ప్రకటించిన నాగ్..

  రాహుల్‌ను విన్నర్‌గా ప్రకటించిన నాగ్..

  టాప్2లో నిలిచిన రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి స్టేజ్ మీదకు వచ్చారు. చిరు ముందు అబీబీ అబీబీ అనే పాట పాడి రాహుల్ అలరించాడు. ఇక రాహుల్, శ్రీముఖి ఇద్దరిలో రాహుల్‌ను విన్నర్‌గా నాగ్ ప్రకటించేశాడు. అనంతరం చిరంజీవి ట్రోఫీని అందజేశాడు. విన్నర్ అని తెలిశాక రాహుల్ వేదికకు పాదాభివందనం చేశాడు.

  రాహుల్ ఎమోషనల్ స్పీచ్..

  రాహుల్ ఎమోషనల్ స్పీచ్..

  అమ్మతోడు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలియాజేయాల్సింది ఏంటంటే.. బిగ్‌బాస్ విన్నర్‌గా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ తనస్టైల్లో అరిచి చెప్పాడు. తనకు ఓట్లు వేసి గెలిపించి నన్ను పది మెట్లు ఎక్కించారు. స్టేజ్ మీది నుంచి చెబుతుున్నా.. ఐ లవ్యూ వితికా ఫేక్ కాదు.. ఫినాలే స్టేజ్ నుంచి చెబుతున్నా.. అంటూ చెప్పేశాడు. తాను మొదట్లో టాస్కులు ఆడలేదని మంచిగా చెప్పిందని వినలేదని ఎదవా ఆడురా .. అందని చివరకు పునర్నవి లాగి పెట్టి కొట్టిందని తెలిపాడు. హౌస్లో నాకు వరుణ్, అలీ రెజా మంచి స్నేహితులు అయ్యారని అన్నాడు. టాస్క్‌లు ఆడటానికి బలం, తెలివి కావాలి.. నేను గెలవడంలో ఆ ముగ్గురి కష్టం ఉంది. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో మా అమ్మనాన్న కడుపులో పుట్టాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. చివరకు చిరు చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాడు. చివర్లో సెల్ఫీ టైమ్‌లో చిరు బుగ్గపై శ్రీముఖి ముద్దు పెట్టేసింది. దీంతో చిరు షాక్ అయ్యాడు. 8కోట్ల 52లక్షల ఓట్లు పోలైనట్లు నాగ్ ప్రకటించాడు.

  English summary
  Bigg Boss 3 Telugu Finale Episode Highlates. Anjali, Nidhi Aggarwal, Raashi Khanna, Maruthi, Srikanth Are Attending This Grand event.It Is Going To Most Prestigious Event. Lets see Who Is Going To Won Bigg Boss 3 Telugu Title.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X