For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వెళ్తూ వెళ్తూ షణ్ముఖ్, కాజల్, ప్రియాంక, రవిల మీద హాట్ కామెంట్స్ చేసిన విశ్వ.. ఏమన్నాడంటే?

  |

  ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగానే 9వ వారం హౌస్ నుంచి విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. ఇక విశ్వ ఎలిమినేట్ అయిన వెళుతూ వెళుతూ కొందరి మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కాజల్, ప్రియాంక , షణ్ముఖ్, రవిల గురించి విశ్వ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. వివరాలలోకి వెళితే

  పాటల టాస్క్

  పాటల టాస్క్

  బిగ్ బాస్ తెలుగు 5 9వ వారంలో చివరి రోజైన ఆదివారం నాడు నాగార్జున ఎంట్రీతో హౌస్ మొత్తం ఆనందం వెల్లివిరిసింది. మామూలుగా సండే అంటే ఫన్ డే అని చెప్పే నాగార్జున ముందు నుంచి కూడా సందడి చేస్తూనే ఉన్నారు.. ముందు రెండు టీములుగా విడగొట్టి సినిమాల్లో ఫోటో లను బట్టి పాటలను గుర్తించి ఆ పాటలు పాడాలి అంటూ ఒక టాస్క్ ఇచ్చారు.

  అందులో భాగంగా ఒక టీం కి సన్నీ కెప్టెన్ గా ఉండగా ఆయన టీమ్ మేట్స్ గా షణ్ముఖ్, సన్నీ, ప్రియాంక, కాజల్, విశ్వగా ఉన్నారు. మరో టీం కి రవి కెప్టెన్ గా ఉండగా ఆయన టీం లో శ్రీ రామ్, సిరి, మానస్, అని మాస్టర్ సభ్యులుగా ఉన్నారు. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య గేమ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కాసేపు కామెడీగా హుషారుగా ఒకరితో ఒకరు పోటీ పడుతూ చివరికి రవి టీం విజయం సాధించింది. ఆ సమయంలో నామినేషన్స్ లో ఉన్న శ్రీ రామ్, కాజల్, విశ్వ, జెస్సి, ప్రియాంక అందరిలో శ్రీరామ్ ని నాగార్జున సేవ్ చేశారు.

  నీవు ఎవరు అనే టాస్క్

  నీవు ఎవరు అనే టాస్క్

  ఆ తర్వాత నీవు ఎవరు అనే టాస్క్ ఇవ్వగా అందులో అందరి పేర్లు రాసి ఉన్న ఒక బౌల్లో, ప్రతి కంటెస్టెంట్ వెళ్లి ఒక చిట్టి తీయాల్సి ఉంటుంది చిట్టి తీసిన తర్వాత చిట్టిలో ఉన్న పేరు ప్రకారం ఎవరైతే ఉన్నారో వారి లాగా యాక్ట్ చేసి చూపించాలి, దానిని వాళ్ళ టీం సభ్యులు కరెక్ట్ గా గెస్ చేసి చెప్పాలి. అయితే ముందు టాస్క్ లో బీ టీం గెలవగా ఈ టాస్క్ లో మాత్రం టీమ్ ఏనే గెలిచింది. ఇక ఈ టాస్క్ పూర్తి అయిన తర్వాత జెస్సీ సేవ్ అవుతున్నట్లుగా నాగార్జున ప్రకటించారు.

  ఆ తర్వాత ఎప్పటిలాగే వరస్ట్ పర్ఫార్మర్ ఎవరు అని చర్చ జరగగా చివరి గా అందరూ కాజల్ వైపు వెళ్ళు చూపించారు, దీంతో ఆమె వరస్ట్ పర్ఫార్మర్ గా నిలిచింది. ఇక ఆమెను రేపటి ఎపిసోడ్ లో జైలుకు పంపించాల్సింది. అయితే మరోపక్క ఈ ఎపిసోడ్ పూర్తి కాగానే ప్రియాంక సేవ్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. చివరికి కాజల్, విశ్వ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అంటూ ప్రకటించారు. చాలాసేపు సస్పెన్స్ తర్వాత విశ్వ ఎలిమినేట్ అయ్యాడు.

  విశ్వ ఎలిమినేట్

  విశ్వ ఎలిమినేట్

  శనివారం నాడు ఎపిసోడ్ లో హీరో గా నిలిచిన విశ్వ ఎలిమినేట్ అయ్యాడు అని తెలిసి అని మాస్టర్ అయితే కన్నీళ్లు పెట్టుకుంది. సన్నీ అయితే ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు, దాదాపు శ్రీరామ్ పరిస్థితి కూడా అంతే చివరికి హౌస్ మేట్స్ అందరూ విశ్వ ఎలిమినేట్ అయ్యే బయటకు వెళ్తున్న సమయంలో అందరు ఎమోషనల్ అయ్యారు. ఇక బయటకు వచ్చిన తర్వాత నాగార్జున వద్దకు వెళ్లిన విశ్వ హౌస్ లో ఉన్న అందరికీ ర్యాంకులు ఇవ్వాల్సి వచ్చింది.

  ర్యాంకులు ఇలా

  ర్యాంకులు ఇలా

  ఈ ర్యాంకులు ఇచ్చిన సమయంలోనే విశ్వ ప్రియాంక, కాజల్ అలాగే షణ్ముఖ్, రవిల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముందుగా 10వ ర్యాంకు నుంచి ర్యాంకులు ఇచ్చుకుంటూ వెళ్లిన విశ్వ ముందు ప్రియాంకకు పదో రాంక్ ఇచ్చాడు. అసలు హౌస్ లోకి ఎంటర్ అయిన వెంటనే తన హార్ట్ కి కనెక్ట్ అయిన మొదటి అమ్మాయి ప్రియాంక అని, అయితే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావ్ అన్నమాట బాధగా అనిపించింది అని చెప్పుకొచ్చారు. ఆమె తప్పు చేయడం తప్పు కాదు కానీ తప్పు చేస్తున్నాననే విషయాన్ని గుర్తించకపోవడం తప్పు అని విశ్వ చెప్పుకొచ్చాడు.

  Manchi Rojulochaie Movie Team Theatre Visit | Blockbuster Celebrations
  వాళ్ళ మీద సంచలనం

  వాళ్ళ మీద సంచలనం

  ఇక అదే సమయంలో కాజల్ కి 9 వ ర్యాంక్ ఇస్తూ ఆమె మంచి ప్లేయర్ కానీ ఈ మధ్య కాన్ఫిడెన్స్ కోల్పోతోందని చెప్పుకొచ్చాడు. ఎనిమిదవ రాంక్ జెస్సీకి ఇచ్చిన విశ్వ, అని మాస్టర్ కు ఏడో ర్యాంక్ ఇచ్చారు. మానస్ కి ఆరవ రాంక్, సిరికి 5 వ ర్యాంక్ ఇచ్చాడు విశ్వ. అయితే 4వ రాంక్ ఇచ్చిన షణ్ముఖ్ విషయంలో మాత్రం ఆయన ఘాటు కామెంట్స్ చేశాడు.

  ఫస్ట్ వీక్ లో చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించి నన్ను కూడా గైడ్ చేసేవాడు కానీ ఇప్పుడు టాస్క్ లో ఓడిపోతే చాలా వీక్ అయిపోతున్నాడని కింద ఎదో కుంపటి ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు అని దాని నుంచి బయటపడాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అందరూ రవిని గుంట నక్క గుంటనక్క అంటున్నారు కానీ రవి చాలా మంచి వ్యక్తిని చాలా బాగా టాస్క్ ఆడతాడని విశ్వ చెప్పుకొచ్చారు. రవి తన తమ్ముడు అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన విశ్వ శ్రీరామ్ గురించి కూడా దాదాపు అలాగే కామెంట్ చేశారు. ఆయనలో తన తమ్ముడిని చూసుకున్నాను అని చెప్తూ ఫస్ట్ ర్యాంక్ ఆయనకె ఇచ్చాడు.

  English summary
  In Bigg Boss Telugu 5 After elimination vishwa made hot comments on contestants.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X