Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Bigg Boss Telugu 6: అసలైన ఎంటర్టైన్మెంట్.. శ్రీసత్య పరువు పోయేలా చేసిన శ్రీహన్.. క్యారెక్టర్స్ చేంజ్!
విన్నర్ యొక్క ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన డబ్బును తిరిగి గెలుచుకోవడానికి ఇప్పుడు ఇంటి సభ్యులందరూ బిగ్ బాస్ ను అలాగే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ వివరణ ఇచ్చినట్లుగా ఆదిరెడ్డి తెలిపాడు. అయితే ఈ ఆటలో కంటెస్టెంట్స్ అందరూ కూడా హౌస్ లోని పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరి యొక్క ఫోటోలను తగిలించుకొని వాళ్ళలా ఇమిటెడ్ చేస్తూ ఉండాలి. 96 వ రోజు హౌస్ లో ఎలాంటి కామెడీ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి అనే వివరాల్లోకి వెళితే..

క్యారెక్టర్స్ చేంజ్
శ్రీ సత్య అయితే ఇనయా సుల్తానా ఫోటోను తగిలించుకుని ఆమెలా ఇమిటెడ్ చేసింది. ఇక ఇనయా సుల్తానా అయితే ఫైర్ బ్రాండ్ గీతూ రాయల్ ఫోటో తగిలించుకొని ఆమె తరహాలో ప్రవర్తించింది. ఇక మరోవైపు రేవంత్ ఫోటోను రోహిత్ కు తగిలించారు. రేవంత్ మాత్రం శ్రీహన్ తరహాలో ఇమిటేట్ చేశాడు. ఇక శ్రీ సత్య మాట్లాడుతున్నట్లుగా రేవంత్ తో కామెడిగా మాట్లాడింది.

ఏ పిట్ట వచ్చి ఏం కూసినా..
ఇక మరోవైపు రేవంత్ ఏ పిట్ట వచ్చి ఏం కూసినా ఏం పట్టించుకోవద్దు అని శ్రీహాన్ తరహాలో కామెంట్ చేశాడు. ఇక కొద్దిసేపటి వరకు శ్రీహన్ అయితే ఫైమా తరహాలో ఫోటోను తగిలించుకుని ఇమిటేట్ చేశాడు. కొద్దిసేపటి వరకు శ్రీహాన్ ఇనయా మధ్యలో గొడవ జరుగుతున్నట్లుగా రేవంత్ శ్రీ సత్య ఇమిటేట్ చేస్తూ కనిపించారు. ఇక పిట్ట అన్నది నన్ను అంటూ ఇనయా మధ్యలో వచ్చి గీతురాయల్ తరహాలో మాట్లాడింది.

శ్రీహన్ కామెడీ
ఇక శ్రీహాన్ బాలదిత్యా స్టైల్ లో మాట్లాడుతూ శ్రీహన్ చాలా మంచివాడు అని అలానే నువ్వు చెడ్డ దానివి కాదమ్మా అంటూ ఆదిత్య ఎలాగైతే మాట్లాడుతాడో అలానే మాట్లాడాడు. ఇక చెవులలో నుంచి రక్తాలు వచ్చేస్తాయి అన్న అంటూ రేవంత్ అతనిపై కామెంట్ చేస్తూ పరిగెత్తాడు. ఇక అర్జున్ శ్రీ సత్య మాట్లాడుకుంటున్నట్లుగా శ్రీహాన్ ఇనయా సుల్తానా ఇద్దరు మాట్లాడుకోవడం హైలైట్ గా నిలిచింది.

నీకు ఏం కావాలన్నా అది చేస్తాను
నీకు ఏం కావాలన్నా అది చేస్తాను అంటూ శ్రీ సత్య మాట్లాడుతున్నట్లు ఇనయా చెప్పింది. ఇద్దరు కూడా బుగ్గలు టచ్ చేసుకుంటూ మరి రొమాంటిక్ గా ఒక ఫీల్ అయితే ఇచ్చారు. ఆ అమ్మాయిని నమ్మకు అంటూ అసలైన శ్రీ సత్య వచ్చి ఇనయాకు చెబుతున్నట్లుగా కామెంట్ చేసింది. ఈ బుగ్గల మీద నీ చేతులు ఉండాలి. మరెవరి చేతులు ఉండకూడదు అంటూ శ్రీహన్ కూడా చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
|
నన్ను టార్గెట్ చేస్తున్నారు
ఇక కొద్దిసేపటికి ఆర్జే సూర్యతరహాలో అక్కడికి వచ్చిన రేవంత్ ఏం జరుగుతుంది.. నాకు ఏమి అర్థం అవుతలేదు అంటూ సరదాగా కామెంట్ చేసాడు. ఇక కీర్తి అయితే నేహా చౌదరి తరహాలో వచ్చి నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నట్లుగా ఇమిటేట్ చేసింది. ఇక రేవంత్ ఎలాగైతే టాస్క్ లో సీరియస్ అవుతాడో అదే తరహాలో ఇనయా సుల్తానా ఇమిటేట్ చేసి చూపించింది. మరి ఈ తరహా ఎంటర్టైన్మెంట్ ఈరోజు ఎపిసోడ్లో ఇంకా ఏ స్థాయిలో హైలైట్ అవుతుందో చూడాలి.