For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: స్టేజిపైకి సూర్య.. ప్రేమ వర్షం కురిపించిన ఇనయా.. అయోమయంలో నాగార్జున!

  |

  ఎన్నో అంచనాలు, విమర్శల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 55 రోజులు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తాజాగా 56వ రోజు కొనసాగనుంది. శని, ఆది వారాల్లో వచ్చే హోస్ట్ నాగార్జున ఆ వారం మొత్తంలో ఇంటి సభ్యులు ఆడిన ఆట తీరు, మాట తీరు, ప్రవర్తన తీరుపై విశ్లేషిస్తూ వార్నింగ్, అడ్వైస్ లను ఇస్తారని తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రసారమైన శనివారం ఎపిసోడ్ లో హద్దు మీరి ప్రవర్తించిన ఇంటి సభ్యులందరికి గట్టి క్లాస్ పీకాడు నాగార్జున. అలాగే ఈ వారం డైరెక్ట్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి షాకిచ్చిన నాగార్జున ఆర్జే సూర్యను ఎలిమినేట్ చేశాడు. ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో స్టేజీపై సూర్య దర్శనమిచ్చాడు.

  గట్టిగా క్లాస్ పీకిన నాగార్జున..

  గట్టిగా క్లాస్ పీకిన నాగార్జున..

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ అక్టోబర్ 29 శనివారం నాటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులందరికి గట్టిగా క్లాస్ పీకాడు హోస్ట్ నాగార్జున. సరిగ్గా ఆడని వాళ్లని, ఇష్టమొచ్చినట్లు రూల్స్ పెట్టుకుని గేమ్ ప్లే చేసిన వాళ్లకు శిక్ష కూడా విధించాడు. చేపల చెరువు టాస్క్ లో సంచాలక్ గా ఉన్న చిత్తూరు చిరుత గీతూ రాయల్ తనకు నచ్చనట్లు గేమ్ ఆడి.. నేను గేమ్ ఆడిస్తున్నా అంటూ ఓవరాక్షన్ చేసింది. ఈ విషయంపై మండిపడిన నాగార్జున ఆమెకు వారం మొత్తం బాత్రూమ్ లు కడగాలని శిక్ష విధించాడు.

   సీరియస్ నుంచి స్మైలింగ్ ఫేస్ కి..

  సీరియస్ నుంచి స్మైలింగ్ ఫేస్ కి..


  గీతూ రాయల్ బిహేవియర్ పై చిత్తూరు చిరుత కాదు చిత్తూరు చింతకాయ అంటూ నెటిజన్లు ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అలాగే ఈ ఎపిసోడ్ లో రేవంత్ ను ఉన్మాదిలా ఆడావంటూ గట్టి క్లాస్ తీసుకున్నాడు. హద్దు దాటి కామెడీ చేస్తున్నావని ఫైమాకు చురక అంటించాడు. ఈ వేడిని తగ్గించేందుకు ఫన్నీ టాస్క్ లతో ఆదివారం వచ్చినట్లు తెలుస్తోంది. హౌజ్ మేట్స్ తో చాలా కూల్ గా మాట్లాడి సీరియస్ నుంచి స్మైలింగ్ ఫేస్ కి వచ్చారు.

   నీ హీరోతో వచ్చావ్..

  నీ హీరోతో వచ్చావ్..

  బిగ్ బాస్ తెలుగు 6 అక్టోబర్ 30 ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చిత్రం హీరోహీరోయిన్లు సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా వచ్చి సందడి చేశారు. వేదికపై వస్తూనే నాగార్జునతో కలిసి డ్యాన్స్ చేసి అలరించింది ఈ జాతి రత్నాలు బ్యూటి. ఫరియా నీ హీరోతో వచ్చావ్ అని నాగార్జున అంటే యస్ సర్ అని అంటుంది. దానికి నేను చాలా ఫీల్ అయ్యాను అని నాగార్జున అంటే సార్.. నా హీరో కూడా మీరే అని సంతోష్ శోభన్ అన్నాడు.

  స్టేజిపైకి సూర్య..

  స్టేజిపైకి సూర్య..

  సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ఇద్దరిని ఇంటి సభ్యులకు ఇంట్రడ్యూస్ చేశారు నాగార్జున. ఏంటీ మీకు అక్కడ ఇవాళ దీపావళి ఆ అని అందరూ.. అంటూ అనింది ఫరియా. ఆమెకు బాగా రెడీ అయి వచ్చారు అనేమాట అనలేకపోయింది. తర్వాత ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఈ క్రమంలో ఫైమాతో కామెడీ చేశారు నాగార్జున. అది చూసి అంతా నవ్వుకున్నారు. అనంతరం ఎలిమినేట్ అయిన సూర్యను స్టేజిపైకి తీసుకొచ్చారు.

  లవ్ ఎక్కువైతే ఇలా అంటారా..

  లవ్ ఎక్కువైతే ఇలా అంటారా..


  సూర్య స్టేజిపైకి రాగానే.. అతనిపై ఉన్న ప్రేమను బయటకు తీసింది ఇనయా సుల్తానా. తన మైక్ పై సూర్యుడి బొమ్మ పెట్టుకుని, సూర్యుడి ఉంగరం పెట్టుకుని సూర్యకు చూపించింది. ఆ తర్వాత వేళ్లతో లవ్ సింబల్ చూపించింది. దీంతో ఏంటి అవన్నీ నాకు అర్థం కావట్లేదు.. నాకు అన్నీ కొత్త కొత్తగా కనపడుతున్నాయి.. అంటే లవ్ ఎక్కువైతే ఇలా అంటారా అని నాగార్జున అంటూ తికమక పడ్డారు. మధ్యలో గీతూను ఏంటీ ఏదో చూసుకుంటున్నావ్ అంటే.. ఏందో సార్ ఈ కొరియన్ లవ్ అంటూ ఎప్పటిలా తన స్టైల్ లో మాట్లాడింది.

  ఫ్లవర్, ఫైర్ రెండు క్యాటగిరీలు..

  అయితే ఇప్పటివరకు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లలో ఒకరైన సూర్యను ఎలిమినేట్ కావండంతో అందరూ ఆశ్చర్యపోయారు. అతన్ని ఎలిమినేట్ చేయకుండా సీక్రేట్ రూమ్ లో ఉంచుతారని ప్రచారం జరిగింది. కానీ దానికి ఈ ప్రోమోతో చెక్ పెట్టేశారు. స్టేజిపైకి వచ్చిన సూర్య వెనుక ఫ్లవర్, ఫైర్ అని రెండు క్యాటగిరీలు ఉన్నాయి. అంటే సూర్య ఇప్పుడు ఇంటి సభ్యులను అందులో దేనికి చెందుతారని చెప్పాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ ఆదివారం ఇంకో ఎలిమినేషన్ ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది.

  English summary
  Bigg Boss Telugu 6 Season 8th Week Eliminated Contestant RJ Surya On Bigg Boss Stage In October 30 Episode Promo
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X