For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Winner: విన్నర్ మెటీరియల్ కు ఊహించని దెబ్బ.. కీలకమైన ఈ వారం ఆ బ్యాడ్ న్యూస్!

  |

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనూహ్య పరిణామాలతో దూసుకుపోతోంది. ఎన్నో అనుమానాలు, అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సీజన్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది. ఇంకొన్ని రోజుల్లో టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ గట్టి పోటి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వీరందరు కోల్పోయిన విన్నర్ ప్రైజ్ మనీని తిరిగి గెలుచుకునేందుకు బిగ్ బాస్ ఈ వారం అంతా ఛాలెంజ్ లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే హౌజ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా, అమ్మాయిలు హస్బండ్ మెటీరియల్ గా భావించే కంటెస్టెంట్ కు ఊహించని దెబ్బ తగిలింది.

  అనేక అనుమానాలు నడుమ...

  అనేక అనుమానాలు నడుమ...

  అమెరికాలో బిగ్ బ్రదర్ అనే పేరుతో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షో కాలక్రమేణా మిగతా భాషల్లోకి రావడం జరిగింది. ఇందులో భాగంగానే తెలుగులో 2017లో అనేక అనుమానాల నడుమ ప్రారంభమైంది. కానీ భారీగా ప్రేక్షకాదరణ పొందింది. వరుస సీజన్లతో దూసుకుపోతూ ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోంది.

  13 వారాల్లో 14 మంది ఔట్..

  13 వారాల్లో 14 మంది ఔట్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో 13 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్, జబర్దస్త్ ఫైమా ఇలా 14 మంది వెళ్లిపోయారు. దీంతో హౌజ్ లో ఏడుగురు మాత్రమే మిగిలారు.

  విస్తరించిన పీఆర్ వ్యవస్థ..

  విస్తరించిన పీఆర్ వ్యవస్థ..

  బిగ్ బాస్ లో విన్నర్ అవ్వాలన్నా, ఫైనల్ వరకు చేరుకోవాలన్న పీఆర్ టీమ్ గట్టిగా ఉండాలనే ఒక వాదన వినిపిస్తోంది. అయితే గత రెండు సీజన్లుగా ఈ పీఆర్ వ్యవస్థ బాగా విస్తరించిందని టాక్. బిగ్ బాస్ కు వెళ్లే కంటెస్టెంట్స్ ముందుగానే పీఆర్ టీమ్ లను సెట్ చేసుకుంటున్నారు. హౌజ్ లోపల వాళ్లు గేమ్ ఆడితే బయట వాళ్ల పీఆర్ టీమ్స్ ఆట ఆడిస్తుంటాయి. ఇక కొందరికి మాత్రం ఎలాంటి పీఆర్ టీమ్ ఉండదు. అలాంటి వారిలో ఒకరు రోహిత్ సహ్ని.

   ఊహించని దెబ్బ..

  ఊహించని దెబ్బ..

  రోహిత్ సహ్ని ప్రస్తుతం టాప్ 7 కంటెస్టెంట్ లో ఒకడు. కానీ అతను ఒక విన్నర్ మెటీరియల్ అని టాక్. బిహేవియర్ అండ్ థింకింగ్ లో స్ట్రయిట్ ఫార్వార్డ్. మిగిలిన కంటెస్టెంట్స్ లా బ్యాక్ బిట్చింగ్, కన్నింగ్ గేమ్స్ ఆడడు రోహిత్. ప్రేక్షకుల అందరిలో రోహిత్ ఒక మిస్టర్ పర్ఫెక్ట్. ఇక అమ్మాయిలకు అయితే హద్దుల్లో ఉంటాడు.. హస్బండ్ మెటిరియల్ అని. అయితే రోహిత్ సహ్నికి తాజాగా ఊహించని దెబ్బ తగిలింది. అతని ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ డిజేబుల్ అయింది.

  ఆందోళనలో ఫ్యాన్స్..

  ఆందోళనలో ఫ్యాన్స్..

  ఇప్పుడు టాప్ 5లోకి వెళ్లేందుకు ఈ వారం చాలా కీలకమైంది. అలాంటి ఈ సమయంలో రోహిత్ అకౌంట్ డిజేబులు కావడం అతనికి పెద్ద దెబ్బ. ఎందుకంటే అందులో అతనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ కనిపించవు. రోహిత్ కు ఓట్ వేయాలకునేవాళ్లు అతని ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో నెంబర్ చూసి ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు ఆ అకౌంట్ డిజేబుల్ కావడంతో అతని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

  రోహిత్ ఓట్ వేయడం ఆపొద్దు..

  రోహిత్ ఓట్ వేయడం ఆపొద్దు..

  ఈ విషయాన్ని తెలుపుతూ రోహిత్ భార్య మెరీనా అబ్రహం వీడియో షేర్ చేసింది. "ఇది చాలా బాధాకరమైన విషయం. రోహిత్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిజేబుల్ అయింది. ఎందుకు ఇలా అయింది. ఎవరు చేశారనేది అర్థం కావడం లేదు. మేం అయితే కంప్లైంట్ చేశాం. 24 గంటల్లో యాక్టివేట్ అవుతుందని చెబుతున్నారు. అప్పటి వరకు నా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో రోహిత్ అప్డేట్స్ పెడుతూ ఉంటాను. ఆ ఖాతాను ఫాలో అవ్వండి. దయచేసి రోహిత్ కి ఓటు వేయడం ఆపొద్దు. ఎందుకంటే ప్రతి ఓటు చాలా విలువనైది. రోహిత్ కు సపోర్ట్ చేయండి" అని తెలిపింది మెరీనా.

  రోహిత్ క్రేజ్ తట్టుకోలేక..

  అయితే రోహిత్ అకౌంట్ అలా అవ్వడానికి కారణం ప్రత్యర్థి పీఆర్ టీమ్ ప్లాన్ అని రోహిత్ ఫ్యాన్స్ అనుమానం తెలియజేస్తున్నారు. రోహిత్ కు వస్తున్న క్రేజ్ తట్టుకోలేకే అతని అకౌంట్ కు రిపోర్ట్ కొట్టారని సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. అయితే టెక్నికల్ సమస్య వల్ల ఇలా అయింటుందని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ అతని గేమ్ ను ఎంత తొక్కేయాలని చూసిన ప్రేక్షకులు మాత్రం పైకి లేపుతున్నారని పలువురు చెబుతున్నారు. కీలకంగా మారిన ఈవారం రోహిత్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంటాడో వేచి చూడాలి మరి.

  English summary
  Bigg Boss Telugu 6 Winner Matetial Rohit Sahni Instagram Account Disabled And Marina Abraham Request To Audience To Vote Him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X