For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: షాకిచ్చిన నాగార్జున.. ఈసారి డైరెక్ట్ ఎలిమినేషన్.. ఉన్మాదిలా ఆడుతున్నావంటూ క్లాస్

  |

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ 54 రోజులు పూర్తి చేసుకుని సూపర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. అలాగే ఇటీవల గాడిలో పడిన కంటెస్టెంట్లు కంటెంట్ ఇచ్చేందుకు బాగానే ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంతమంది హద్దు దాటి ప్రవర్తించారు. వారందరిని శనివారం అంటే అక్టోబర్ 29న ప్రసారమయ్యే ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున గట్టిగానే క్లాస్ పీకారు. ఇంతకుముందు విడుదల చేసిన ప్రోమోలో గలాట గీతూ రాయల్ ఆడిన గేమ్ పై చాలా సీరియస్ అయ్యారు. ఆమె సంచాలక్ గా చేయాల్సింది ఏంటి.. చేసింది ఏంటని ఫైర్ అయ్యాడు. అలాగే గీతూ రాయల్ పనిష్ మెంట్ కు అర్హురాలు అని ప్రకటించారు. తాజాగా అక్టోబర్ 29న ప్రసారమయ్యే ఎపిసోడ్ రెండో ప్రోమోను విడుదల చేశారు.

  54 రోజులు పూర్తి చేసుకున్న రియాలిటీ షో..

  54 రోజులు పూర్తి చేసుకున్న రియాలిటీ షో..


  ఎన్నో అంచనాలు, విమర్శల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 54 రోజులు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తాజాగా 55వ రోజు కొనసాగనుంది. వారం మొత్తంలో ఇంటి సభ్యులు ఆడిన ఆట తీరు, మాట తీరు, ప్రవర్తన తీరుపై విశ్లేషిస్తూ వార్నింగ్, అడ్వైస్ లను హోస్ట్ నాగార్జున ఇస్తారని తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా శనివారం వచ్చిన నాగార్జున హద్దు మీరి ప్రవర్తించిన ఇంటి సభ్యులందరికి గట్టి క్లాస్ పీకాడు.

  ఫుడ్ ఐటమ్ అయితే గుర్తు ఉంటుంది..

  ఫుడ్ ఐటమ్ అయితే గుర్తు ఉంటుంది..

  తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ తెలుగు 6 అక్టోబర్ 29 ఎపిసోడ్ రెండో ప్రోమోలో.. బాలాదిత్యకు కోపం కూడా వచ్చింది అని నాగార్జున అంటే.. బాధేసిందని బాలాదిత్య చెప్పాడు. సత్యతోనేనా గొడవ అని నాగార్జున అడగ్గా.. అవును సార్ అని బదులిచ్చాడు బాలా. దీనికి వెంటనే లేచిన సత్య.. సారీ చెప్పాను సార్.. అని అంటే.. గీతూ చెప్పమంటే చెప్పావ్ అని నాగార్జున అన్నాడు. తర్వాత నాకు ప్రామీస్ గా గుర్తు లేదు సార్ అని సత్య అంటే.. అదే ఫుడ్ ఐటమ్ అయితే గుర్తు ఉంటుందని నాగార్జున కౌంటర్ ఇచ్చారు.

  గీతూ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడింది..

  గీతూ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడింది..


  అనంతరం శ్రీహాన్, శ్రీసత్యల గేమ్ ప్రస్తావిస్తూ మీరిద్దరు కలిసి ఆడారా.. లేక మిగతా జంటల సహాయం తీసుకుని ఆడారా అని నాగార్జున ప్రశ్నిస్తే.. కలిసే ఆడాం సార్ అని ఇద్దరు సమాధానం ఇచ్చారు. మీకు ఎవరు చేపలు ఇవ్వలేదా అని నాగ్ అడగడంతో.. గీతూ పక్కన పడేసినవి తీసుకున్నామని శ్రీసత్య చెప్పింది. దీంతో గీతూ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడింది మీ గేమ్ అని నాగార్జున అన్నారు.

  ఫెమినిస్ట్ మాట్లాడాల్సిన మాటలేనా..

  ఫెమినిస్ట్ మాట్లాడాల్సిన మాటలేనా..

  శ్రీహాన్, శ్రీ సత్య తర్వాత వాసంతి గురించి మాట్లాడుతూ.. ఈ చిట్టీల ఆట ఏంటమ్మా.. ఎంతో ఫైట్ చేసి చేసి.. సింపుల్ గా ఇచ్చేశావ్ అని నాగార్జున అనడంతో.. వాసంతితో సూర్య మాట్లాడిని విషయం చెప్పి అది నాకు ట్రిగ్గర్ కావడంతో వదిలేశాను సార్ అని చెప్పింది. దీంతో వెంటనే నాగార్జున్.. సూర్య నువ్ ఫెమినిస్ట్ అని చెప్పుకుంటావ్ గా.. మరి ఫెమినిస్ట్ మాట్లాడాల్సిన మాటలేనా అవి క్లాస్ తీసుకున్నారు.

  అగ్రెషన్ కనిపిస్తోంది..

  అగ్రెషన్ కనిపిస్తోంది..


  తర్వాత ఫైమాను ఉద్దేశిస్తూ కామెడీకి హద్దు ఉంటుందనేది ఒక్కోసారి మర్చిపోతున్నావ్ అని అన్నారు నాగార్జున. దానికి అర్థం కానట్లు మొహం పెట్టింది ఫైమా. ఆ తర్వాత రేవంత్ గేమ్ ఆడిన తీరు గురించి వీడియోను ప్లే చేశారు. వీడియో తర్వాత నేను కావాలని చేయలేదని రేవంత్ చెప్పాడు. దీంతో ఇంటెన్షనల్ గా చేశావని నేను చెప్పడం లేదు. కానీ అగ్రెషన్ కనిపిస్తోంది. ఒక ఉన్మాదిలాగా ఆడుతున్నావ్ అని సీరియస్ గా అన్నారు నాగార్జన.

  అనూహ్యంగా సూర్య ఎలిమినేట్..


  వీళ్లందరికి క్లాస్ తీసుకున్న తర్వాత ఈరోజు ఎపిసోడ్ లో డైరెక్ట్ ఎలిమినేషన్ ఉంటుంది.. ఇప్పుడే అంటూ షాక్ ఇచ్చాడు నాగార్జున. దీనికి ఇంటి సభ్యులందరు నిర్ఘాంతపోయారు. ప్రోమో చివర్లో ఒక కంటెస్టెంట్ ను బయటకు పంపించి వేశారు. అది ఆర్జే సూర్యనే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నిల్చున్న వారందరిలో సూర్య కనిపించలేదు. అలాగే బిగ్ బాస్ తెలుగు 6 ఎనిమిదో వారం అనూహ్యంగా సూర్య ఎలిమినేట్ అవుతాడని ఇప్పటికే పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

  English summary
  Bigg Boss Telugu 6 Season Host Nagarjuna Gives Shock To Housemates With Direct Elimination And October 29 Episode Promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X