Bigg Boss Telugu 6: ఎగ్ షాట్ ఛాలెంజ్ లో చివరి ట్విస్ట్.. చివరలో సపోర్ట్ కోసం శ్రీసత్య పోరాటం

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ మొత్తానికి తుది దశకు చేరుకుంటుంది. ఈ వారం మిగిలిన 6 మంది కంటెస్టెంట్లలో ఎవరు ఫైనల్స్ లోకి వెళతారు అలాగే చివరగా కప్పు అందుకునేది ఎవరు అనే విషయంలో క్లారిటీ రానుంది. ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చివరి దశలో బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక ఈవారం శ్రీ సత్య పై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. కొద్ది సేపటి క్రితం వచ్చిన ప్రోమో కూడా నేటి ఎపిసోడ్ పై అంచనాలను పెంచింది. ఆ వివరాల్లోకి వెళితే..

మరో ఛాలెంజ్ ఎగ్ షాట్

మరో ఛాలెంజ్ ఎగ్ షాట్

ఓటు అప్పీల్ చేసే అవకాశానికి దగ్గరవ్వడానికి బిగ్ బాస్ ఇస్తున్న మరో ఛాలెంజ్ ఎగ్ షాట్. ఈ ఛాలెంజ్ లో కేవలం పోటీలో ఉన్న సభ్యులు శ్రీహాన్ శ్రీసత్య రేవంత్ మాత్రమే పోటీ పడతారు.. అని రేవంత్ బిగ్ బాస్ నోట్ ను చదివి వినిపించాడు. ఇక టాస్క్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక గ్లాస్ లో ఎగ్ ను పగలకుండా కాళ్ళతో పెట్టాల్సి ఉంటుంది. ఇక ఆ ఛాలెంజ్ లో గెలిచిన శ్రీ సత్య రేవంత్ ఇద్దరు ఓట్ అప్పీల్ చేసే అవకాహాశానికి దగ్గరయ్యారు.

ఏకాభిప్రాయంతో నిర్ణయించి

ఏకాభిప్రాయంతో నిర్ణయించి

ఇక ఇప్పుడు వీరి దగ్గర నుంచి ఏ ఒక్కరికి ఓట్ అప్పీల్ చేసే అవకాశం లబించాలి. ఆ విషయంలో మిగతా ఇంటి సభ్యులు ఏకాభిప్రాయం తో నిర్ణయించి బిగ్ బాస్ కు చెప్పండి.. అని ఆదిరెడ్డి చదివి వినిపించారు. ఇక నేను సత్యకు అనుకుంటున్నాను అంటూ శ్రీహన్ చెప్పగా విన్నింగ్ కు దగ్గరగా ఉన్న వ్యక్తికి ఈ ఓటు అప్పీల్ అనేది ఇంకాస్త అడ్వెంటేజ్ అవుతుందని అనిపోస్తోంది. అందుకే నేను రేవంత్ కు సపోర్ట్ చేస్తున్నాను అని ఆదిరెడ్డి చెప్పాడు.

ఆదిరెడ్డి vs శ్రీసత్య

ఆదిరెడ్డి vs శ్రీసత్య

ఇక ఆల్ రెడీ రిజల్ట్ కు దగ్గరున్న వారికి ఓటు అప్పీల్ దేనికి? లేని వాళ్ళకు కదా కావాలి అని శ్రీ సత్య ప్రశ్నించారు. దీంతో నీ ఒపీనియన్ చెప్పేటప్పుడు నేను ఏమి మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడి వెస్ట్.. అని ఆదిరెడ్డి ఆన్సర్ ఇచ్చాడు. అయితే అందరూ ఇక్కడ గట్టిగానే ఆడారు అని శ్రీ సత్య చెప్పింది. కొంతసేపు వీరి మధ్య లాజిక్స్ తో కూడిన మాటల యుద్ధం కొనసాగింది. సపోర్ట్ తనకి కావాలని శ్రీసత్య వాదించే ప్రయత్నం చేసింది.

శ్రీ సత్య అవుట్?

ఇక నీ కంటే గట్టిగా రేవంత్ ఆడాడు అని ఆదిరెడ్డి అనడంతో అతను నాకంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ అని అనడంతో.. సింపుల్ అని అందుకే నేను చెబుతున్నాను అని ఆదిరెడ్డి చెప్పాడు. మరి ఈ గొడవతో హౌస్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి. అయితే ఈ వారం శ్రీ సత్య ఏలిమినెట్ అయినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన 5 మంది కంటెస్టెంట్స్ టాప్ 5లో ఫైనల్స్ లో పోటీ పడనున్నారు. ఈ సీజన్ లో విన్నర్ గా రేవంత్ అని టాక్ వస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X