For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాసా?.. మిడ్‌నైట్ మసాలా?.. అక్రమ సంబంధాల గోలేమిటిరా నాయనో..

  By Rajababu
  |

  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో వినోదం కరువతుందనే ఆరోపణలకు 16వ రోజు ఎపిసోడ్ బలం చేకూర్చింది. ఇంటిల్లి, పిల్లా జెల్లా కూర్చొని చూసే కార్యక్రమం అని మరిచారేమో నిర్వాహకులు.. అక్రమ సంబంధాలను ప్రోత్సహించే విధంగా వీక్షకులకు రోత పుట్టించారు. కొన్ని ఎపిసోడ్లను ఆహ్లాదకరంగా చూపిస్తూ.. వెంటనే వెగటు పట్టించే విధానాన్ని చూస్తే బిగ్‌బాస్ కార్యక్రమం విపరీతమైన ఒత్తిడికి లోనైనా సెన్సెక్స్ గ్రాఫ్‌లా అనిపిస్తుంది.

  నాసిరకంగా 16వ రోజు ఎపిసోడ్

  నాసిరకంగా 16వ రోజు ఎపిసోడ్

  బిగ్‌బాస్ 16వ రోజు ఎపిసోడ్ చాలా నాసిరకంగా కనిపించింది. దిశానిర్దేశం లేకుండా గందరగోళంగా సాగింది. వినియోగదారులు, వసూలు దారులు అంటూ ఓ కాన్సెప్ట్‌తో సాగిన ఎపిసోడ్ చాలా నీరసంగా మారింది. 70 రోజుల ఎలా ముగించాలా అనే నేపంతో ఏదో టైంపాస్ కోసం ఆడిన గేమ్‌లా కనిపించింది.

  Bigg Boss Telugu: NTR Warning To DhanRaj
  మౌనవ్రతం వీడిన కల్పన

  మౌనవ్రతం వీడిన కల్పన

  నటనపరంగా శివబాలాజీ, హరితేజ లేకుండా ఆ కాస్తంతైనా అడల్డ్ కామెడీ పండేది కాదేమో. మౌనవ్రతం పట్టిన కల్పన ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నట్టు కనిపించింది. అశోకవనంలో సీతలా కనిపించిన కల్పన ఇప్పడిప్పుడే రిలీఫ్‌గా కనిపిస్తున్నది. కల్పన కోలుకుంటుందా గత కొద్దిరోజులుగా వెంటాడిన అనుమానం పటాపంచలైపోయింది.

  ఆకట్టుకొన్న శివబాలాజీ, హరితేజ

  ఆకట్టుకొన్న శివబాలాజీ, హరితేజ

  కల్పన భర్తగా శివబాలాజీ స్టయిల్‌గా నటించాడు. ధన్‌రాజ్‌కు భార్యగా ముమైత్ నటించింది. పనిమనిషిగా హరితేజ కనిపించింది. శివబాలాజీ, ధన్‌రాజ్‌కు గాలం వేసే వంట మనిషిగా హరితేజ ఆకట్టుకొన్నది. గోపి లోలా అంటూ పాట పాడుతూ.. ధన్‌రాజ్‌ను పిలిచే సీన్‌లో తెగ అలరించింది. కల్పన కూడా నా మొగుడితో నీకేంటి పని అని హరితేజతో గొడవ పడటం కూడా ఓకే అనిపించేలా ఉంది. ఇక మహేశ్ కత్తికి చాలా రోజుల తర్వాత చేతినిండా పనిదొరికింది.

  ముమైత్ అనవసరపు ఆవేశం

  ముమైత్ అనవసరపు ఆవేశం

  ఇక మంగళవారం ఎపిసోడ్‌లో ముమైత్ ఎందుకు ఆవేశపడిందో ఎవరికీ అర్థం కాదు. గేమ్ కాన్సెప్ట్ అర్థం కానందుకా? లేదా అర్చన మాట్లాడిన తెలుగు భాషను అర్థం చేసుకోలేకానా అనే సందేహం వీక్షకులకు కలుగకమానదు. 16వ రోజు ఎపిసోడ్ చూస్తే ముమైత్‌ను ఎందుకు కొనసాగిస్తున్నారో అనేది ఓ పట్టాన అర్థం కాదు.

  సబ్‌టైటిల్స్‌తో విసుగు

  సబ్‌టైటిల్స్‌తో విసుగు

  ఇక బిగ్‌బాస్‌ను చూస్తే తెలుగు రియాలిటీ షో నేనా అనే అనుమానం కలుగక మానదు. తెలుగు సీరియల్‌లో సబ్‌టైటిల్స్ వేస్తూ బుల్లితెర వీక్షకులను విసుగు పుట్టిస్తున్నారు. మంచిగా తెలుగు మాట్లాడే జ్యోతి, మధుప్రియలను బయటకు పంపించి భాష రాని ముమైత్‌తో నరకం చూపిస్తున్నారు. బిగ్‌బాస్ ముమైత్‌ను ఎలిమినేట్ చేయండి అని దూకుడులో బ్రహ్మానందం అరిచే విధంగా ప్రేక్షకులుగా మారాల్సిన పరిస్థితి ఎదురవుతుందో ఏమో.

  మరోక రోజు కూడా ఈ బాధ తప్పదా?

  మరోక రోజు కూడా ఈ బాధ తప్పదా?

  ఇక 16వ రోజుతో పేలవమైన ఎపిసోడ్ ముగుస్తుందేమో అని అనుకొన్న వీక్షకులకు నిరాశే మిగిలింది. వినియోగదారులు, వసూలుదారుల ఎపిసోడ్ బుధవారం కూడా చూడాల్సి రావడం మన ఖర్మ అనే విధంగా బిగ్‌బాస్ మారడం శోచనీయం. గేమ్ విధానాన్ని మార్చి కొంత జనరంజకంగా మారిస్తే తప్ప బిగ్‌బాస్ దూసుకుపోయే అవకాశం కనిపించడం లేదు.

  English summary
  Biggboss reality show 16th days episode becomes very boring affair. Content of this show seen like midnight masala. Its seems like pure adult comedy affair. Even in this kind of environment Shiva Balaji, Hariteja attracted viewers by their acting skills.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X