twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ శిఖా చౌదరికి బిగుస్తున్న ఉచ్చు.. లాంగ్ డ్రైవ్‌పైనే అనుమానాలు!

    |

    ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత జయరాం చిగురుపాటి హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. జయరాం మేనకోడలు యాంకర్ శిఖా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. జయరాం హత్యకు సంబందించిన అనేక ప్రశ్నలు తలెత్తుతుండడంతో శిఖా చౌదరిపై అనుమానాలు పెరుగుతున్నాయి. దీనితో స్వయంగా శిఖా చౌదరిని పోలీసులు స్వయంగా విచారణ చేయనున్నారు. జయరాం సతీమణి పద్మశ్రీ శిఖా చౌదరిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తుండడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

     ఏసిపి కార్యాలయానికి

    ఏసిపి కార్యాలయానికి

    జయరాం హత్య కేసులో అనేక అనుమానాలు, మలుపులు చోటు చేసుకుంటుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జయరాం సతీమణి పద్మశ్రీ.. తన భర్త హత్యలో శిఖా చౌదరి ప్రమేయం ఉందంటూ తీవ్రమైన ఆరోపణలు చేసింది. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇక నేరుగా శిఖా చౌదరిని కూడా విచారించేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆమె గురువారం బంజారా హిల్స్ లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరైంది.

     కోటి రూపాయలు కావాలంటూ

    కోటి రూపాయలు కావాలంటూ

    జయరాం వ్యాపార లావాదేవీల్లో శిఖా చౌదరి, ఆమెతో సన్నిహితంగా మెలిగిన రాకేష్ ప్రమేయం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాకేష్ పెద్ద మొత్తంలో డబ్బుని ఖర్చు చేసినట్లుకూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాకేష్, జయరాం మధ్య కొంత వాగ్వాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది. తనకు కోటి రూపాయలు కావాలి, ఇబ్బందుల్లో ఉన్నా అంటూ జయరాం పలు సందర్భాల్లో శిఖా చౌదరికి ఫోన్ చేసి అడిగినట్లు తెలుస్తోంది.

    లాంగ్ డ్రైవ్

    లాంగ్ డ్రైవ్

    కాగా హత్య జరిగిన ముందురోజే శిఖా చౌదరి లాంగ్ డ్రైవ్ కు వెళ్ళింది. తన సొంత మేనమామ అంత ఇబ్బందుల్లో ఉండగా శిఖా చౌదరి లాంగ్ డ్రైవ్ కు ఎందుకు వెళ్ళింది అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. అదే సందర్భాల్లో జయరాం సతీమణి పద్మశ్రీ కూడా ఓప్రశ్న లేవనెత్తారు. జయరాం మరణించిన విషయాన్ని ఆమె తల్లి ద్వారా తెలుసుకున్న శిఖా చౌదరి నేరుగా నందిగామ ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించారు. జయరాం ఇంటికి వచ్చి అంత హడావిడి చేసి కొన్ని వస్తువులని ఎందుకు తీసుకెళ్లింది అని పద్మశ్రీ ప్రశ్నించారు.

     డాక్యుమెంట్ల కోసం

    డాక్యుమెంట్ల కోసం

    ఇలాంటి ప్రశ్నలన్నీ పోలీసులు శిఖా చౌదరికి సంధించనున్నట్లు తెలుస్తోంది. శిఖా చౌదరి కూడా తన వర్షన్ వాదన వినిపిస్తోంది. జయరాం మరణించిన తర్వాత ఎలాగు అతడి మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకు వస్తారు. అందుకే నేరుగా హైదరాబాద్ వచ్చాను. మూడు రోజుల క్రితం ఆయనతో ఫోన్ లో మాట్లాడినప్పుడు కొన్ని డాక్యుమెంట్ల ప్రస్తావన వచ్చింది. వాటిని తీసుకునేందుకే ఇంటికి వెళ్ళాను అని శిఖా తెలిపింది.

    English summary
    Chigurupati Jayaram death mystery: Sikha Chowdary attends for interrogation
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X